COVID-19 మహమ్మారి గత ఆరునెలలుగా వరుస లాక్‌డౌన్ లకు, దేశ ఆర్ధిక వ్యవస్థ పతనానినికి కారణమైంది. కొంతకాలంగా విద్య, వృత్తి, పని వంటి సాధారణ కార్యకలాపాలు ఆన్‌లైన్ అనే కొత్త విధానానికి తెరలేపాయి. దురదృష్టవశాత్తూ క్షరకులు, సౌందర్య నిపుణులు వంటి రోజువారీ వ్యాపార నిపుణులు ఆన్‌లైన్ ద్వారా పనిచేయలేరు, అంతేకాకుండా ప్రస్తుత సంక్షోభం వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
దుకాణాలు మూసివేయడం, చెల్లించవలసిన బిల్లులు, వ్యాపారం లేకపోవడం భారతదేశంలోని 4 మిలియన్ల క్షరకుల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 2020లో సగం కాలం గడిచిపోవడంతో, భారతదేశంలోని క్షరకులు ప్రభుత్వం నిర్దేశించిన కఠినమైన భద్రతా నిబంధనలను పాటిస్తూ తిరిగి వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.
స్వతహాగా వారి వృత్తి వారిని మరింత ప్రమాదంలోకి నెడుతుంది, అందువలన క్షరకులు, వారి వినియోగదారుల సంరక్షణకు ప్రత్యేకమైన శిక్షణ, సామాగ్రి అవసరం. అయితే ఈ రంగంలో 50% రోజువారీ వేతనానికి పనిచేసేవారు కావడంతో వారు ఈ ప్రత్యేక సామాగ్రి, పరికరాలపై పెట్టుబడి పెట్టడం కష్టమైన పని.
భారతదేశపు ప్రముఖ గ్రూమింగ్ బ్రాండ్ Gillette బార్బర్ల ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచి, #GroomTheirFuture వారి భవిష్యత్తుని మెరుగుపరచడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. Gillette బార్బర్ సురక్ష ప్రోగ్రామ్ అనబడే ఈ కార్యక్రమం మూడు అంచెల విధానాన్ని అనుసరిస్తూ, దేశంలో COVID-19 లాక్‌డౌన్ తరువాత తిరిగి వ్యాపారం ప్రారంభిస్తున్న క్షరకులకు శిక్షణ, సంరక్షణ, వనరులను అందిస్తుంది. దేశంలోని క్షరకులకు ఎల్లప్పుడూ గర్వకారణమైన భాగస్వామిగా నిలిచే Gillette, COVID-19 వ్యాప్తి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఈ రంగానికి మద్దతు తెలపడానికి ముందడుగు వేసింది. లాక్‌డౌన్ పై సడలింపులు ఉన్నప్పటికీ క్షౌర సంఘం పరిస్థితి దుర్భరంగా ఉందని బ్రాండ్ అభిప్రాయపడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా Gillette క్షరకులకు లక్ష రూపాయల ఆరోగ్య భీమా, వినియోగదారులకు సేవలు అందించే సమయంలో సామాజిక దూరం పాటించడం, చేతులను శుభ్రపరచుకోవడం, సాధనాలను క్రిమి సంహారకాలతో శుభ్రపరిచే పద్దతులపై అవగాహన కలిగించడం వంటి అంశాలపై శిక్షణ అందిస్తుంది. ప్రఖ్యాత స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్‌తో కలిసి రూపొందించిన వీడియోల ద్వారా ఈ శిక్షణను అందించడం జరుగుతుంది. రెండు నెలలకు సరిపడా కావలసిన వస్తువులతో కూడిన ‘సురక్ష’ కిట్లతో క్షరకులు తమ వ్యాపారాలను నిరంతరాయంగా చేసుకోవడానికి వారికి మద్దతు లభిస్తుంది. ఈ కిట్లలో క్షరకుల సంఘం, వారి వినియోగదారుల భద్రతకు ఉపయోగపడే సాధారణ సామాగ్రితో పాటు అదనంగా ఆప్రాన్, గ్లౌజులు, ముఖ కవచాలు వంటి రక్షణ వస్తువులు ఉంటాయి.
https://youtube.com/watch?v=z7JRY496OMc%3Fautoplay%3D1%26loop%3D1%26mute%3D1%26enablejsapi%3D1%26origin%3Dhttp%253A%252F%252Fapi-news.dailyhunt.in%26widgetid%3D1
క్షరకుల దుస్థితిని తెలియచేయడానికి బ్రాండ్ అడ్వకేట్ సచిన్ టెండూల్కర్ మద్దతుతో ఒక చిత్రాన్ని విడుదల చేసింది. వారు Gillette బార్బర్ సురక్ష ప్రోగ్రామ్ గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు, “లాక్డౌన్ కారణంగా ఎంతోమంది ప్రభావితమైనప్పటికీ, వారిలో ఎక్కువగా ప్రభావితమైన వారిలో క్షౌర మిత్రులు కూడా ఉన్నారు. Gillette బార్బర్ సురక్ష అనేది ప్రస్తుత సమయంలో చాలా అవసరం. ఇది వారి జీవితాలలో సానుకూలమైన మార్పు కలిగించమే కాకుండా, నిజంగా #GroomTheirFuture లో హృదయపూర్వకంగా భాగం అవుతుంది”.
బార్బర్ సురాక్ష చొరవ ద్వారా షేవ్ కేర్ ముఖ్యంగా అప్పులు, ఆర్ధిక ఒత్తిడికి లోనవుతున్న క్షౌర సమాజానికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 50,000 క్షరకులకు పూర్తి సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ సంస్థ, తమ ప్రచారంతో తరువాతి దశలో తప్పకుండా ఎక్కువ సంఖ్యకు చేరుకుంటుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.