బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బ్యూటీ ఈమె నే

Spread the love

Teluguwonders:

💚హోస్ట్ గా రమ్యకృష్ణ :

ఆమె హోస్ట్ చేసిన రెండు ఎపిసోడ్‌లు ఫుల్ ఫన్ నింపింది. ప్రేక్షకులు ఇన్నాళ్లూ ఏదైతే కోరుకున్నారో ఆ వినోదం ఆదివారం నాటి ఎపిసోడ్‌లో దొరికింది. రమ్యకృష్ణ ఇచ్చిన జోష్‌తో కంటెస్టెంట్స్ కూడా పెర్ఫామెన్స్‌తో ఇరగదీశారు. ఒకర్నిమించి ఒకరు పెర్ఫామెన్స్‌తో పిచ్చెక్కించారు.

ఆదివారం రాత్రి రమ్యకృష్ణ కంటెస్టెంట్స్‌తో ఆడించిన ‘సీన్ చేయండి’ టాస్క్‌ అదిరింది. సీన్ చేయండి అంటే రమ్యకృష్ణ టాస్క్ ఇస్తే సీన్లను చింపేశాడు కంటెస్టెంట్స్. ఇక రమ్యకృష్ణ కంటెస్టెంట్స్‌కు బంబర్ ఆఫర్ ఇస్తూ.. ఈవారం ఎలిమినేషన్‌‌ను ఎత్తేసింది. సో.. ఎలిమినేషన్‌లో మహేష్, పునర్నవి, హిమజలు సూట్ కేస్ సర్దేయకుండా ఊపిరిపీల్చుకున్నారు.
👉 బిగ్ బాస్ సీజన్‌లో ఆటను మరింత రంజుగా మార్చేందుకు బిగ్ బాస్ కొత్త స్కెచ్‌లు వేస్తున్నారు. ఇంట్లో వాళ్లు సరిపోరు అన్నట్టుగా కొత్తవాళ్లను రంగంలోకి దింపుతున్నారు.
.. బిగ్ బాస్ హౌస్‌లో మరింత జోష్ నింపేందుకు వైల్ కార్డ్ ఎంట్రీతో మరో బ్యూటీని ఆటలోకి దింపుతున్నారు. తొలి రెండు సీజన్లలో దీక్షపంత్, నవదీప్, నందితా రాయ్, పూజా రామచంద్రన్ ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి గట్టి పోటీ ఇచ్చారు.

అయితే సీజన్ 3లో ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తమన్నాను హౌస్‌కు తీసుకురావడంతో ఆ వెంటనే బయటకు పంపించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇక తమన్నా చేసిన రచ్చ వల్ల వైల్డ్ కార్డ్ అంటేనే ప్రేక్షకుల్లో హడల్ మొదలైంది. మళ్లీ ఎవర్నిదింపి రచ్చ చేయిస్తారని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

🌟Anchor Shilpa Chakravarthy:

ఈ సందర్భంలో శ్రద్ధాదాస్, హెబ్బా పటేల్, ఇషా రెబ్బా ఇలా చాలా పేరు వినిపించగా.. వీరందర్నీ కాదని ప్రేక్షకులు మరిచిపోయిన ఒకప్పటి యాంకర్‌ను రంగంలోకి దింపుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. యాంకర్ సుమ, ఝాన్సీల కాలం నాటి యాంకర్ శిల్పా చక్రవర్తిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్‌కు తీసుకువస్తున్నారు. సుమ, ఝాన్సీలు ఇంకా ఫీల్డ్‌లో రాణిస్తున్నప్పటికీ ఎప్పుడో తెరమరుగైన శిల్పా చక్రవర్తికి వైల్డ్ కార్డ్ ఇచ్చి మరీ బిగ్ బాస్ హౌస్‌కి రప్పిస్తున్నారు.

👤 ‘ఎవరది’:

వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన లీక్ ముందే బయటకు రాగా.. తాజాగా స్టార్ మా వాళ్లు ‘ఎవరది’ అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతున్న కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ప్రోమో వదిలారు. అయితే ఫేస్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడినా.. కటౌట్ హెయిర్ స్టైల్ చూసి.. ఆమె శిల్పా చక్రవర్తి అంటూ నెటిజన్లు ముందే పసిగట్టేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్ కూడా టీవీ, సోషల్ మీడియాతో ఫేమస్ అయినవారే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా తోడుకావడంతో ఆట మరింత రంజుగా మారుతుందో.. లేక నీరసించిపోతుందో చూడాలి.

💚రమ్య రమ్య నే :

ఇలా అంటే నాగార్జున ఫ్యాన్స్‌కి కోపం వస్తుందికాని.. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున స్థానంలో రమ్యకృష్ణ ఎంట్రీ ఇవ్వడం హౌస్‌కి కళ వచ్చింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading