రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు..
రాం చరణ్ ఊటీ వెళ్ళాడు . చాలా సంతోషాన్ని పొందాడు..ఊటీ వెళ్తే సంతోష పడటమేమిటి…వాళ్ళు తరచుగా వెళ్లారు కదా అనుకుంటున్నారు కదా..తను సంతోష పడింది ఊటీ వెళ్లినందుకు కాదు ఊటీలో తను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లి నందుకు. అవును చిన్ననాటి జ్ఞాపకాలను..ప్రదేశాలను,చదువుకున్న స్కూల్ ను మళ్ళీ చూసినప్పుడు ఎవరైనా చాలా సంతోష పడతారు. ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ కి వెళ్ళినప్పుడు, క్లాస్ రూంలో మనం కూర్చున్న బెంచ్, హాస్టల్ గదిలో మనం పడుకున్న మంచం ఇలా అప్పట్లో మనం వాడిన ప్రతి వస్తువును చూడగానే మన ముఖంలో ఏదో తెలియని ఆనందం, చిరునవ్వు వచ్చేస్తాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇలాంటి అనుభూతే కలిగింది. చరణ్ చిన్నప్పుడు ఊటీలో చదువుకున్న లారెన్స్ స్కూల్ లోవెడేల్‌ను తాజాగా సందర్శించారు.
రామ్ చరణ్ స్కూల్‌ను సందర్శించినప్పటి ఫొటోలను ఆయన సతీమణి ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘జ్ఞాపకాలు ఎప్పటికీ అలానే ఉండిపోతాయి! ప్రతి ఒక్కరూ స్కూల్‌ను మిస్సవుతారని నాకు తెలుసు. స్కూల్ క్యాంటీన్, డార్మిటరీ, క్లాస్ ఫొటో ఇలా తన స్కూల్ డేస్ నాటి ఎన్నో జ్ఞాపకాలను మిస్టర్ సి నెమరువేసుకున్నారు. ఆయనలోని పిల్లాడిని వెనక్కి తీసుకొచ్చారు’ అని ఉపాసన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలను అంత త్వరగా మర్చిపోలేము
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.