రోహిణి ఎలిమినేషన్ – పునర్నవి ప్రేమ వ్యవహారం:ఆసక్తిగా బిగ్ బాస్ 3

Rohini Elimination - PUNARNAVI Love Affair
Spread the love

TELUGUWONDERS:

అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేషన్‌తో భావోద్వేగానికి గురై తెగ ఏడ్చింది శివజ్యోతి. ఒక రకంగా రోహిణి ఎలిమినేట్ కావడానికి శివజ్యోతినే కారణం కావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది జ్యోతి.

🔴బిగ్ బాస్ 29వ ఎపిసోడ్‌:

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 28 ఎపిసోడ్‌‌లను ముగించుకుని ఆదివారం నాడు 29వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.

🔴ఆ ఇద్దరూ సేఫ్:

నాలుగో వారం ఎలిమినేషన్ జోన్‌లో ఏడుగురు ఉండగా.. శివజ్యోతి, వరుణ్ సందేశ్ ఇద్దరూ సేఫ్ కాగా.. బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్‌‌లు ఐదుగురు డేంజర్‌ జోన్‌లోనే ఉన్నారు. ఈ ఐదుగురులో ఎవర్ని నాగార్జున ఇంటి నుండి సాగనంపుతున్నారనే ఆసక్తితో ఎపిసోడ్ ప్రారంభమైంది.
ఎలిమినేషన్‌లో ఉన్న ఐదుగురు టెస్ట్ పెట్టి వాళ్లు మాస్క్‌ తీసి ఉంటున్నారో లేదో తెలుసుకునేందుకు సరదా టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం లాయర్లు, జడ్జ్‌లు, నిందితులుగా సెపరేట్ చేశారు.

🔴 కోర్టుగా మారిన బిగ్ బాస్ హౌస్‌:

నిన్నటి ఎపిసోడ్‌లో మాస్క్‌లు తొలగించుకుని మీరు మీలా ఉండాలని సలహా ఇచ్చిన నాగార్జున.. దాన్ని హౌస్ మేట్స్ ఎంతవరకూ పాటిస్తున్నారు వాళ్లు ఇంకా నటిస్తూ మాస్క్‌లతోనే నటిస్తున్నారో లేదో విషయాన్ని తెలుసుకోవడానికి బిగ్ బాస్ హౌస్‌ని కోర్టుగా మార్చేశారు. నాగార్జున ఒక పేరు చెప్పి వాళ్లు హౌస్‌లో ఎందుకు ఉండకూడదో కారణం చెప్పాలని వాదనలు వినిపించాలని కోరారు. 👉మొదటిగా బాబా భాస్కర్ హౌస్‌లో ఎందుకు ఉండకూడదో చెప్పాలని మహేష్ విట్టాను వాదించాల్సింది లాయర్ బాధ్యతలు అప్పగించారు నాగార్జున. . బాబాకి తెలుగు రాదని, ఆయనకు ఇగో ప్రాబ్లమ్‌తో పాటు ఇంటికి వెళిపోదామని ఆయనకు ఉందంటూ బాధ్యతల్ని చేపట్టిన మహేష్ చెప్పారు. గేమ్ ఇచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆడతారని.. ఆయన ఎప్పుడూ కిచెన్‌లో ఉంటారని మహేష్ విట్టా వాదనలు వినిపించారు.

🔴బాబా భాస్కర్ అబ్జేక్షన్ :

అయితే మహేష్ వాదనల్ని అబ్జెక్ట్ చేస్తూ.. వీటికి నేను ఒప్పుకోను అంటూ సరదాగా ఆటపట్టించారు బాబా భాస్కర్. నాకు తెలుగు సరిగా రాకపోవడం వల్లే ప్రాబ్లమ్ వస్తుందని.. నాకు ఇగో లేదంటూ.. మహేష్‌కి ఉన్నవాటిని నాకు అంటకడుతున్నాడు అంటూ నాగార్జునతో పాటు హౌస్ మొత్తాన్ని నవ్వించారు.

🔴 పునర్నవి ముసుగు తీసేసిందా?

 

గేమ్‌లో భాగంగా రాహుల్ ఈ హౌస్‌లో కొనసాగటానికి ఎందుకు అర్హత లేదో ప్రాసిక్యూట్ చేయాలని పునర్నవికి బాధ్యతలు అప్పగించారు నాగార్జున. రాహుల్ టాస్క్‌లలో ఇంట్రస్ట్ పెట్టడు. ఎప్పుడూ నవ్వుతూ గేమ్‌ని సీరియస్‌గా ఆడడు. ఇంట్లో ఉన్నవి మొత్తం తినేస్తాడు అంటూ వాదించింది పునర్నవి.

అయితే జడ్జ్‌గా ఉన్న శివజ్యోతి.. అతను తింటున్నాడు అంటే ఈమె ప్రేమగా పెట్టడం వల్లే.. రాహుల్‌ ఎవర్నైనా ఏమైనా కావాలంటే ,రాత్రి 11 అయినా వెంటనే లేచి ఇస్తుంది అంటూ పంచ్ పేల్చింది. 👉ఏదో ప్రేమతో పెడుతున్నాం.. పైగా నేను కిచెన్‌ టీమ్‌లో ఉన్నాను కాబట్టి ఇచ్చా తినిపించా ఏదో ప్రేమగా అంటూ కవర్ చేసుకుంది పునర్నవి.

ఆమె వాదనలు విన్న హౌస్ మేట్స్.. నిజమే ఆమె ఏదో ప్రేమగా చేస్తుందిలే అంటూ ఇన్ డైరెక్ట్‌ పంచ్ పేల్చేరు. మొత్తానికి పునర్నవి ఈ ప్రేమ విషయంలో ముసుగు తీసేసిందా? అంటే అవును ఆమె ప్రేమతో ముసుగు తీసేసిందంటూ తీర్పు ఇచ్చారు జడ్జ్‌లుగా ఉన్న సావిత్రి, అలీ, వరుణ్‌లు. నాగార్జున కూడా నువ్ రాహుల్‌కి తినిపించడం నేను కూడా చూశాలే ప్రేమతో అంటూ జలక్ ఇచ్చారు.

అనంతరం శ్రీముఖిని హిమజ.. రవిని వితికా షెరు.. రోహిణిని అషు ప్రాసిక్యూట్ చేసి వాళ్లు హౌస్‌లో కొనసాగడానికి అర్హత లేదని రకరకాల కారణాలను తెలియజేశారు.

🔵ఫైనల్ గా రోహిణి ఔట్ :

ఈ గేమ్ తర్వాత అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్‌‌లలో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేషన్‌తో భావోద్వేగానికి గురై తెగ ఏడ్చింది శివజ్యోతి. ఒక రకంగా రోహిణి ఎలిమినేట్ కావడానికి శివజ్యోతినే కారణం కావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది జ్యోతి. నామినేషన్‌ టైంలో శివజ్యోతి, రోహిణిలు గుసగుసలాడటంతో రోహిణిని డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు బిగ్ బాస్. పశ్చాత్తాపంతో చెంపపై కొట్టుకుంటూ బోరు బోరున ఏడ్చింది శివజ్యోతి.

మొత్తంగా నాలుగో వారం ఎలిమినేషన్‌లో రోహిణి బయటకు వెళ్లడంతో ఫైనల్ గా 12 మంది మాత్రమే హౌస్‌లో మిగిలారు.

👉ఇక తరువాతి ఎపిసోడ్‌లో ఐదోవారం ఎలిమినేషన్‌కి నామినేషన్ ఉండటంతో ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారు.. అనేది ఆసక్తికరంగా మారింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading