Latest

    కశ్మీర్ లో కల్లోలానికి Pak కుట్ర..!

    జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నరేంద్రమోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాక్ రగిలిపోతోంది. అందుకు పాకిస్తాన్ కాశ్మీర్ లో కల్లోలం సృష్టించేందుకు భారీ ప్రణాళికలనే రచిస్తుందని ముందునుంచి భారత్ ఊహిస్తూనే ఉంది. భారత్ ఊహించినట్లే పాకిస్తాన్ వేస్తున్న కుట్రలను పసిగట్టింది. ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులు భారత్ బలగాల చేతికి చిక్కారు. వారిద్దరూ పాక్ జాతీయులేనని విచారణలో వెల్లడైంది. భారత బలగాలకు చిక్కన ఈ ఉగ్రవాదులు ఇంటరాగేషన్ లో పాక్ పన్నుతున్న పన్నాగాన్ని బయటపెట్టారు.

    ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. కశ్మీర్ లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. భద్రతా దళాల అదుపులో ఉన్న ఉగ్రవాదులు ఖలీల్ అహ్మద్ – నజీం ఖోకర్ లు పాక్ దుష్ట పన్నాగాన్ని బయటపెట్టారు. పాక్ ఆర్మీ తమకు శిక్షణ ఇచ్చిందని – దాని సహకారంతోనే కశ్మీర్ లో చొరబడినట్టు వివరించారు. భారత భద్రతా దళాలే లక్ష్యంగా చెలరేగిపోవాలని ఆర్మీ అధికారులకు తమను ఆదేశించిందని ఉగ్రవాదులు పేర్కొన్నారు.

    పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని లష్కరే తాయిబా ఉగ్రవాద శిబిరాల్లో తమకు శిక్షణ ఇచ్చారని – ఆయుధాలు ఉపయోగించడం ఎలానో నేర్పారని తెలిపారు. కాశ్మీర్ ను కల్లోలం చేయాలనుకుంటున్న పాకిస్తాన్ కుట్రలను ఛేదించే క్రమంలో భారత బలగాలకు ఏడుగురు ఉగ్రవాదులు చిక్కారు. ఇందులో ఇద్దరు పాక్ జాతీయులు కాగా – ఐదుగురు ఆఫ్ఘానిస్తాన్ పౌరులు కావడం విశేషం.

    పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్ సహయంతో కాశ్మీర్ లో భారీ విధ్వంసాలకు పాల్పడి ప్రపంచం దృష్టిలో భారత్ తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్ పౌరులు ఇష్టంగా లేరని అందుకే కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి లేకపోవడంతోనే ఇలా హింసకు పాల్పడుతున్నారని చూపే ప్రయత్నం చేస్తుందని సమాచారం. కాశ్మీర్లో పాక్ ప్రధానంగా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడమే లక్ష్యం కావడంతో భద్రతాదళాలు అప్రమత్తం అయ్యాయి.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading