చేసిన తప్పు నిరూపించబడడంతో చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 160 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇండియా లో కాదు లేండి..ఇండియానా లో .160 ఏళ్ల జైలు శిక్ష..అయ్యో అనుకుంటున్నారా.. అతడు చేసిన తప్పేంటో తెలిస్తే.. ఇది కూడా తక్కువే అంటారు… సమాజంలో రానురాను పెరిగిపోతున్న దారుణానికి ఇది ఒక పరాకాష్ట.
వివరాల్లోకి వెళ్తే :
ఇండియానాకు చెందిన 34 ఏళ్ల నికోలస్ త్రాష్ అనే వ్యక్తికి అక్కడి న్యాయస్థానం 160 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నికోలస్ చేసిన నీచపు పనికి కోర్టు ఈ శిక్ష వేసింది.
🔴పదేళ్ల బాలికపై అత్యాచారం : నికోలస్ పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి..ఆ బసలిక ను తల్లిని చేశాడు. నికోలస్ మూలాన గతేడాది బాధిత బాలిక 11 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
🔴బాధిత బాలిక ఫిర్యాదు: ఈ ఏడాది ప్రారంభంలో గ్రాంట్ కౌంటీలో బాధిత బాలిక నికోలస్‌పై కోర్టుకెక్కడంతో ఈ దారుణం బయటకు వచ్చింది. కాగా, నికోలస్‌పై గతేడాది ఆగస్టులో కూడా పిల్లలపై వేధింపులకు పాల్పడినట్టు పది కేసులు నమోదయ్యాయని గ్రాంట్ కౌంటీ ప్రాసిక్యూటర్ జిమ్ లుట్రల్ పేర్కొన్నారు. బాధిత బాలిక ఎంతో ధైర్యంగా అతడిపై ఫిర్యాదు చేసి కోర్టుకు ఈడ్చిందని జిమ్ తెలిపాడు. ఇందుకు ఆమెకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నికోలస్‌పై నేరం నిరూపించబడడంతో ఇండియానా చట్టం ప్రకారం అతడికి 160 ఏళ్ల జైలు శిక్ష పడింది.