సిని ఇండస్ట్రీ లో స్టార్ ల పుట్టినరోజు వేడుకులు అభిమానులు అంగరంగ వైభవం గా జరుపుకుంటారు. ఒక్క పుట్టినరోజు కాకుండ కొత్త పోస్టర్ , టీజర్ , ట్రైలర్ , మొదటి పాట లాంటివి కూడా తమ అభిమానాన్ని అంబరానికి చేరుస్తారు.
తెలుగు చిత్రపరిశ్రమ లో పుట్టినరోజు రోజు న అభిమానులు కేక్ కట్ చేయడం , పండ్లు , స్వీట్ లు పంచడం చేస్తుంటారు. రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రక్త ల ను సేకరించి బ్లడ్ బ్యాంకు లకు అందజేస్తారు. ఐతే ఇప్పుడు ఓ ప్రముఖ కదానాయకుడు స్టార్ హీరో పుట్టినరోజు వేడుకలకు దూరం గా ఉంటున్నారు.
ప్రతి సారి పుట్టినరోజు వేడుకల ని ఘనం గా నిర్వహిస్తు, వారి దగ్గరే ఉంటూ అభిమానాన్ని పంచుకునే వారు . ఐతే ఎన్టీఆర్ ఈ సారి వేడుకల కు దూరం గా ఉండటానికి గల కారణం ఉంది. గత ఏడాది ఆగష్టు 30 న హరికృష్ణ రోడ్ ప్రమాదం లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి ఇప్పటికి నందమూరి కుటుంబo కోలుకోలేక పోతుంది.
ఎంత గా మర్చిపోవాలి అన్నా . ఇప్పటికి ఆ ఘోరం కళ్ల ముందే ఉంది. అయన దూరం ఐ ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే ఈ ఏడాది పుట్టినరోజు జరుపుకోవడం లేదు అని సన్నిహితులు తెలిపారు. మరో మూడు రోజుల్లో ఎన్టీఆర్ బర్త్డే ఉండటం తో అభిమానులు భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు.