మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ పేరుతో త్వరలో రూ.10 డినామినేషన్ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) జారీ చేయనుంది. రానున్న కొత్త పది రూపాయల నోట్లపై గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండనున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్త సిరీస్ లో వచ్చే రూ.10 బ్యాంకు నోట్ల డిజైన్ కూడా ఇటీవల రిలీజ్ చేసిన పది నోట్ల డిజైన్ మాదిరిగానే ఉండనున్నట్టు తెలిపింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన అన్ని పాత రూ.10 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఓ లీగల్ టెండర్ ప్రకటనలో తెలిపింది.
👉2019 ఏప్రిల్ లో ఆర్బీఐ మహాత్మాగాంధీ సిరీస్ లో రూ.200, రూ.500 నోట్లలో మార్పుని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
♦200రూ. నోట్ పై: రూ. 200 నోట్ల ఫీచర్లలో కళారూపమైన సాంచి స్థూపం ఉంటుంది.
♦500రూ. నోట్ పై: రూ. 500 నోట్లలో ఎర్రకోట థీమ్ తో పాటు స్వచ్ఛ భారత్ లోగో ‘ఏక్ కదమ్ స్వచ్ఛతా కి ఔర్’ అని హిందీ భాషలో రాసి ఉంటుంది. రూపాయి సింబల్ లో గ్రీన్-బ్లూ కలర్ మార్పు డినామినేషన్ కరెన్సీలో హైలెట్ గా నిలవనుంది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో వీటిని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
👉చాలామంది రూ.10 నాణాలను తీసుకోకపోవడం తో పది నాణాలు చెల్లుబాటు అవుతాయని rbi క్లారిటీ ఇచ్చింది. ఈ మార్పులను ఒకసారి గమనించండి.