ఆంద్రప్రదేశ్లో మొన్న ఏప్రిల్ లొనే కదా ఎన్నికలు జరిగాయి మళ్ళీ ఎన్నికలు అంటున్నారేంటి..అని ఆశ్చర్యపడుతున్నారా.. అయినా మరో మారు ఈ ప్రచారాలు, హోరు, తిట్ల దండకాలు, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ వినక తప్పదు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. చాలా తొందరగానే.
🔴మున్సిపల్ ఎన్నికలు :
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే మునిసిపల్ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిధ్ధపడుతున్నారు. అసలు ఈ ఎన్నికలు ఏపీలో ఎపుడో జరిపించాలి. పాలక వర్గాల గడువు కూడా పూర్తి అయింది. కానీ అసలైన ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ఎందుకని ఆపేశారు. ఇలా ఎప్పటికపుడు వాయిదా పడిన మునిసిపల్ ఎన్నికలు ఇపుడు ఒక్కసారిగా తోసుకువస్తున్నాయి.
ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హై కోర్టు మే 1 నాటికి ఓటర్ల జాబైతాను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
దీంతో మే 1న ఓటర్ల జాబితాను విడుదల చేసింది.త్వరలో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేయనుంది. అంటే ఇపుడు మళ్ళీ పోలింగ్ బూతుల ముందుకు మరో మారు పోలోమని ఓటర్లు పరుగులు పెట్టాలన్న మాట. కొత్త సర్కార్ ఇప్పుడే ఏర్పాటు అయ్యింది కాబట్టి త్వరలోనే ఎన్నికల నగారా మోగబోతుంది..