మెంటల్ కృష్ణకు..ఏమైంది..?

Spread the love

ఆయన ‘మహర్షి’, ‘మజిలీ’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం రాబోయే మహేష్ బాబు – అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఓ పక్క వైస్సార్సీపీ పార్టీ కి మద్దతు ఇస్తూనే సినిమాల్లోనూ బిజీ బిజీ గా నటించారు. రాజకీయాల్లోనూ,సినిమాల్లోనూ ఇంత బిజీగా ఉంటున్న ఆయన మరెవరో కాదు. మెంటల్ కృష్ణ గా సుప్రసిద్ధమయిన విలక్షణ నటుడు , రచయిత, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ఈ మధ్య అనారోగ్యంతో హాస్పటల్ లో చేరారు.

🔴 అసలు ఏమయ్యింది : గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు పోసాని.దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను యశోద ఆసుపత్రిలో చేర్చారు.

👉Condition ఎలా ఉందంటే : శనివారం నాడు వైద్యులు పోసానికి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందట.కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు.

👉పరామర్శలు : ఆయన విషయం తెలుసుకున్న రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు ఆయన్ను చూసేందుకు హాస్పటల్ కు క్యూ కడుతున్నారు.
🔴YSR పార్టీ తరపున :
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయనతో పాటు వైఎస్సార్‌ రాష్ట్ర కార్యదర్శి, కమెడియన్ పృథ్వీ పరామర్శించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *