Teluguwonders: ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో గాల్వే నుంచి డబ్లిన్ వెళ్లే ఐర్నాడ్ ఏరీన్న్ ఐరిష్ రైలులో ఒక సంఘటన చోటుచేసుకుంది. దాంతో ఒక పసిపాపకు రైల్వే స్టేషన్ కు మధ్య 25ఏళ్ల సంబంధం ఏర్పడి పోయింది .
🚆విషయం ఏమిటంటే : ఈ నెల 11వ తేదీన గాల్వే నుంచి డబ్లిన్ వెళ్లే ఐర్నాడ్ ఏరీన్న్ ఐరిష్ రైలులో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ మహిళ రైలులోనే పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో రైల్వే అధికారులు ఆ చిన్నారికి 25 ఏళ్ల వరకు ఉచిత రైల్వే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
🚆వివరాల్లోకి వెళితే : ట్రైన్ టాయిలెట్ నుంచి మహిళ పురిటినొప్పులతో బాధపడుతున్న అరుపులు విన్న రైలులో క్యాటరింగ్ చేసే ఏమ్మా టోట్ అనే మహిళ వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసింది.
🚆సహకరించిన ప్రయాణికులు : డ్రైవర్ ప్రయాణికులలో ఎవరైన వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారు ఉంటే గర్భిణి డెలివరీకి సహకరించేందుకు ముందుకు రావాలని కోరాడు. రైల్వే సిబ్బంది సమాచారంతో ఆలన్ డివైన్ అనే వైద్యుడు ఇద్దరు నర్సుల సహయంతో మహిళకు పురుడు పోశారు. అనంతరం చికిత్స కోసం తల్లిబిడ్డ ఇద్దరిని డబ్లిన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపతో పాటు తల్లి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.. 🌷రైలులోనే పండంటి పాపకు జన్మనివ్వడం వల్ల రైల్వే అధికారులు ఎంతో సంతోషించి ఆ చిన్నారికి 25 ఏళ్ల వరకు ఉచిత రైల్వే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.