Teluguwonders: ఆకలిని తీర్చే ఆహారం ఆయువును ని తీస్తుంది అని ఎవరైనా అనుకుంటామా.. ఎవరు అనుకోము కదా .మృత్యువాత తప్పనప్పుడు అది అనుకోని విధంగా ఏ రూపంలోనైనా రావచ్చు. ఒక్కోసారి చిన్న గడ్డిపరక కూడా మరణానికి కారణం అవ్వచ్చు . ఇక్కడ కారణం గడ్డిపరక కాకపోయినా ఆరోగ్యం కోసం తీసుకునే ఆహారమే మృత్యువు కి కారణం అయ్యింది. 👉అప్పటివరకు హాయిగా నిద్రపోతున్న ఒక తొమ్మిది నెలల చిన్నారికి లేవగానే కంటి ముందు ఆకర్షణీయంగా ఒక ఆహార పదార్థం కనపడింది వెంటనే దానిని తినాలి అనుకున్నాడు. కానీ అదే తన మృతికి కారణం అవుతుందని తెలుసుకోలేకపోయాడు పాపం ఆ పసివాడు… 🔴ఈ విషాదకరమైన ఘటనసిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామన్నపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది.
🔵విషయం ఏమిటంటే :
9 నెలల చిన్నారి అప్పుడు వరకు హాయిగా నిద్రపోయాడు. లేవగానే.. మంచం ముందు ద్రాక్ష పండు కనిపించింది. అబ్బా అనుకుంటూ నోట్లో వేసుకున్నాడు. అయితే పాపం ఆ పసివాడికి అది గొంతుకు అడ్డం పడుతుందన్న విషయం తెలీదు. దీంతో గొంతులో అడ్డం పడిన ద్రాక్ష పసివాడి ప్రాణాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.దీంతో బాబు కాస్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. మార్గం మధ్యలోనే చనిపోయాడు.
🔵వివరాల్లోకి వెళ్తే: రామన్నపల్లికి చెందిన భూపతిరెడ్డి, లత భార్యాభర్తలు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. పేరు వసంత్ రెడ్డి, వయసు 9 నెలలు. శుక్రవారం కుటుంబ సభ్యులు చిన్నారికి ఎంతో ప్రేమతో ద్రాక్ష పండ్లను ముక్కలుగా కోసి తినిపించారు. అనంతరం బాబును నిద్ర పుచ్చారు. కాసేపటికి నిద్ర లేచిన వసంత్ మంచం పక్కనే ఉన్న ముక్కలు చేయని ద్రాక్ష పండ్లను తిన్నాడు. అవి గొంతులో ఇరుక్కోవడంతో ఉక్కిరిబిక్కిరై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఏడాది కూడా నిండాకుండానే తమ చిన్నారి చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేం అని ఈ సంఘటన నిరూపిస్తోంది.