Latest

    తండ్రి కోసం దేశ ప్రధానికి 36 లేఖలు రాసిన ఒక కుర్రోడు..

    భర్త ప్రాణాన్ని తిరిగి సంపాదించిన సతీ సావిత్రి గురించి విన్నాము. తండ్రి గురించి ప్రభుత్వంతో పోరాడిన కొడుకు కథ విన్నామా..!! లేదు కదా ..అయితే రండీ విషయం లో కి వెళ్దాం :
    🔴ఉత్తరప్రదేశ్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌(యూపీఎస్‌ఈ)లో ఒక వ్యక్తి ఉద్యోగం చేసేవాడు. కొందరి కుట్రల వల్ల పాపం అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

    🔴 తండ్రి ఉద్యోగం కోసం ప్రధానికి 36 లేఖలు: 8వ తరగతి చదువుతున్న ఆ వ్యక్తి కొడుకు తన నాన్న జాబ్‌ తిరిగి ఇప్పించండని పేర్కొంటూ ప్రధాని మోదీకి లేఖ రాసాడు. ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రధానికి లేఖ రాయడం ఇది 37వ సారి. 👉2016 నుంచి ప్రధానికి లేఖలు ; ఆకుర్రోడు 2016 నుంచి ప్రధానికి 36 లేఖలురాశాడు. గడిచిన 36 లేఖలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఈ విషయాన్ని బాలుడు లేఖలో పేర్కొంటూ తిరిగి జాబ్‌ ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరాడు.

    🔴సమస్యలను వివరిస్తూ : ఉద్యోగం కోల్పోవడం వల్ల తమ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మీరు ఇచ్చిన స్లోగన్‌ విన్నాను. ప్రజలకు తెలుసు మోదీ ఉంటే ప్రతిది సాధ్యమేనని. అందుకే మా విన్నపాన్ని ఒక్కసారి ఆలకించాల్సిందిగా కోరుతున్నట్లు విద్యార్థి పేర్కొన్నారు. తన తండ్రి విషయంలో తప్పుడు చర్యలకు పాల్పడ్డవారికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందిగా కోరాడు. 👉తండ్రికి న్యాయం జరగాలని పోరాడుతున్న ఈ కుర్ర వాణ్ణి చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. అబ్బాయి కోరిక త్వరలోనే నెరవేరాలని మనసారా కోరుకుంటున్నారు . 👉మరి మోడీ దృష్టికి ఈ పిల్ల వాడి బాధ ఎప్పటికి చేరుతుందో ఏమో..


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading