కొలంబస్..కొలంబస్ ఇ చ్చారు సెలవు..అంటూ జీన్స్ మూవీ లో ఒక సాంగ్ ఉంటుంది.వీకెండ్ సెలవు గురించిన సందర్భం లో ఆ పాట వస్తుందా సినిమా లో..సెలవు రోజునే కాదు ..అక్కడ పని చేస్తే ..పని చేస్తూ కూడా అదే పాటను పడుకోవచ్చు.ఎందుకంటే అక్కడ పని రోజులు కూడా సెలవు రోజులే మరి.
🏂విషయంలో కి వెళ్తే: వారానికి నాలుగు రోజుల పని..సంవతర్సానికి కోటికి పైగా జీతం..ఈ ఆఫర్ వింటుంటే ఆలస్యం చేయకుండా అప్లయ్ చేయాలనిపిస్తుంది కదూ! సముద్ర తీరంలో అందమైన దీవిలో, అలల శబ్దం తప్ప వేరే శబ్దాలు వినిపించని ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉద్యోగం అంటే పని చేసినా చేయనట్టే ఉంటుంది కదా..
🤸🏻♀జాబ్ డీటెయిల్స్ ఇవి :అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈస్ట్ బ్రదర్ లైట్ స్టేషన్ సంస్థ ఈ అద్భుతమైన ఆఫర్‌ని ప్రకటించింది. శాన్ పాబ్లో సముద్రపు దీవిలో ఉన్న స్టేషన్ భవనాన్ని చూసుకోవడానికి( కేర్ టేకర్) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. ఇంత జీతం ఇచ్చి ఉద్యోగులను తీసుకోవడం అంటే ఆషామాషీ కాదు.
🔹ఐదు గదుల హోటల్ అది :ఆ హోటల్ గతం లో లైట్‌హౌస్. దీన్ని 1874లో నిర్మించారు. 1960లో ఆధునికీకరించారు. అయితే ఇప్పుడు మాత్రం ఐదు గదుల హోటల్‌గా మార్చారు. వారానికి నాలుగు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది.
పదిమంది పర్యాటకులు బస చేసేలా దీని నిర్మాణం జరిపారు.
👉వర్కర్స్ కి కండిషన్స్ : హోటల్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారు దాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. పర్యాటకులు ఎవరైనా వస్తే వాళ్లను ఒడ్డు నుంచి హోటల్‌కి తీసుకురావాలి. తిరిగి ఒడ్డుకు చేర్చాలి. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు భోజనం వండిపెట్టాలి. హోటల్‌లోనే 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఉద్యోగులకు కావాల్సిన వస్తువులను, ఆహార పదార్థాలను సంస్థ ఉచితంగా ఇస్తుంది. కచ్చితంగా ఇద్దరు పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు భార్యాభర్తలు అయితే మరింత బాగుంటుందని ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నది. రెండేళ్లపాటు తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. బోట్ నడపడంలో లైసెన్స్ ఉండాలి.అయినా సరే ఉద్యోగం..అదిరింది..కాకపోతే కాస్త గరిట తిప్పడం,బోట్ నడపడం వచ్చుంటే..ఇక పండగే..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.