పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి..బ్లాక్ బస్టర్ బేబీ పేరు ఏంటొ తెలుసా?
ప్రపంచానికి పరిచయం చేసుకున్న పాప
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందరికి నమస్కారం ,నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత,నందు-ల బ్లాక్ బస్టర్ బేబీని నేనే అంటూ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీనికి విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి..
ఆగస్టు 9న గీతా మాధురికి పండంటి బిడ్డ పుట్టినట్లు ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన పాప ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలిపింది. రీసెంట్‌గా ఆ పాపకు పేరు పెట్టారు.
బిగ్‌బాస్ రెండో సీజన్ రన్నర్‌గా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది గీతా మాధురి. పాటలు పాడి ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. సరైన సమయంలో గొంతువిప్పి మాట్లాడి నిజాన్ని బతికిచింది. గీతా మాధురిలో ఉన్న ఈ ధైర్యమే తనను అక్కడి వరకు చేర్చింది. విన్నర్‌గా నిలవాల్సిన గీతా మాధురి కొన్నికారణాలతో రన్నర్‌గానే మిగిలిపోయింది.
విన్నర్ తో కృష్ణవంశీ కనెక్ట్… అటు ఇటయితే ఎఫెక్ట్…
బిగ్ బాస్ కి నో చెప్పిన మహేష్ బాబు.. చాలా మంది ఉన్నారన్న ఎన్టీఆర్ ? రణ్‌బీర్ కపూర్ పై సంచలన వ్యాఖ్యలు పాటలతో ఎంటర్టైన్ చేసిన గీత.. బిగ్‌బాస్ రెండో సీజన్ మొత్తాన్ని తన పాటలతో నింపేసి.. అందర్నీ మెప్పించింది. తనదైన స్టైల్లో హాస్యాన్ని పండిస్తూ అందరికీ చేరువైంది. గీత, శ్యామల, దీప్తి ఒక జట్టులా ఉండేవారు. ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడాల్సి వచ్చిన సమయంలో నిక్కచ్చిగా మాట్లాడేది. బాబు గోగినేనితో కూడా పోటాపోటిగా వాదించేది.
బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్.. సీజన్ ముగిశాక బయటకు వచ్చిన గీతా మాధురి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. అందరూ కలసి ఏదైనా ఈవెంట్ చేసుకుంటే హాజరై సోషల్ మీడియాలో అప్డేట్లు పెడుతూ ఉండేది. స్వరాభిషేకం కార్యక్రమంలో పాల్గొని అప్పటి బిగ్ బాస్ సెట్ గురించి, గడిపిన క్షణాల గురించి చెప్పుకునేది. వాటన్నంటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది.