Latest

    నేడు జరుగనున్న 5వ రోజు సచివాలయ పరీక్షలు

    Teluguwonders:

    కేటగిరీ-2 ఉద్యోగాలకు ఉదయం సెషన్‌లో, కేటగిరీ-3 ఉద్యోగాలకు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. సాయంత్రానికి ప్రాథమిక ‘కీ’ వెల్లడి అవ్వనుంది.AP Grama Sachivalayam Recruitment 2019 ఏపీలో 1.26 లక్షల గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియమాకాల్లో భాగంగా ఐదోరోజు (సెప్టెంబరు 7) ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

    💥15,159 ‘సచివాలయ’ ఉద్యోగాల భర్తీకి నేడు జరుగనున్న రాతపరీక్షలు :

    ఏపీలో ఏర్పాటుకానున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి.. శనివారం (సెప్టెంబరు 7) 15,159 పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో కేటగిరీ-2 పరిధిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్-11,158 పోస్టులు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ-3601 పోస్టులు ఉండగా.. కేటగిరీ-3 పరిధిలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్-400 పోస్టులు ఉన్నాయి.

    కేటగిరీ-2 ఉద్యోగాలకు ఉదయం సెషన్‌లో, కేటగిరీ-3 ఉద్యోగాలకు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఉదయం నిర్వహించిన పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని ఈరోజు సాయంత్రం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని రాత్రికి విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు పరీక్ష కీలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చూసుకోవచ్చు.

    ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలపడానికి మూడురోజులు అవకాశం ఉంటుంది. 👉ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది.సెప్టెంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా ప్రాథమిక కీలపై అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంటుంది


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading