బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన నటీమణులు కొందరు వెండితెరపై హీరోయిన్లుగా ఛాన్సులు దక్కించుకుంటుంటారు. 34ఏళ్ల హాట్ బ్యూటీ నుస్రత్ భరూచా కూడా టివి నటిగానే కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నుస్రత్ నటిస్తోంది. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. అందంగా కనిపించడానికి ప్రతి ఒక్క హీరోయిన్ ప్రయత్నిస్తుంది.
అందుకోసం లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫాలో అవుతారు. తాజాగా నుస్రత్ కూడా ఓ కార్యక్రమంలో ట్రెండీ డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. గ్రీన్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ లో నుస్రత్ ఒక వైపు మొత్తం శృతి మించేలా ఎక్స్ ఫోజింగ్ ఉంది. దీనితో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. నుస్రత్ డ్రెస్ మరీ ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్ చేశారు.
హద్దులు దాటేలా అందాల ఆరబోత అవసరమా అని కొందరు ప్రశ్నించారు. తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు నుస్రత్ ఘాటుగా బదులిచ్చింది. తాను ధరించే దుస్తుల విషయంలో ఇతరులు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది.
నాపై వస్తున్న కామెంట్స్ ని పట్టించుకోను. నాకు నచ్చిన బట్టలు ధరించే హక్కు నాకుంది. ఒక వేల నేను వేసుకున్న బట్టలు నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడే మార్చుకుంటాను. నటిగా ఉన్నాను కాబట్టి నా అందం గురించి, డ్రెస్ గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదని నుస్రత్ తెలిపింది.
సుగాలి ప్రీతి కేసు: పవన్ ఫ్యాన్స్ ఒత్తిడి.. హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇదే