హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రివ్యూలు ప్రదర్శించడం గమనార్హం. అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
🔹కథ :
కార్తీక్ (హవిష్ ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ.. యూఎస్ వెళ్లాలని గోల్ పెట్టుకుంటాడు. అయితే రమ్య (నందితా శ్వేతా), జెన్నీ (ఆనిశా), అదితి ఆర్యా ఇలా ముగ్గురు అమ్మాయిల ఒకరు తరువాత ఒకరు తమ భర్త కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లేయింట్ చేస్తారు.
ఆ తరువత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఆ అమ్మాయిల అందరూ చెప్పిన భర్త కార్తీక్ (హవిష్ ) ఒకరే అని తేలుతుంది. కార్తీక్ అమ్మాయిలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారని, పోలీస్ లు అతన్ని వెతికి పట్టుకుంటారు. కానీ అంతలో అచ్చం కార్తీక్ లాగే కృష్ణమూర్తి అనే మరో వ్యక్తి ఉండేవాడని తేలుతుంది. ఇంతకీ ఆ అమ్మాయిలను మోసం చేసింది కార్తీకేనా ? లేక కృష్ణమూర్తినా ? అసలు కృష్ణమూర్తి ఎవరు ? అయినా ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రేమ కథలు ఒకేలా ఎందుకు ఉన్నాయి ? మొత్తానికి కార్తీక్ జీవితంలో ఏమి జరిగి ఉంటుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
🔹విశ్లేషణ :
ముందుగా ఈ చిత్రం కథాంశం ఆకట్టుకుంటుంది. మొత్తానికి రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాని మలచాలని దర్శకనిర్మాతలు బాగానే ప్రయత్నం చేశారు. అమ్మాయిల ఫిర్యాదులకు తగ్గట్లుగా ఇన్వెస్ట్ గేషన్ చేసే సీన్లు ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతాయి. అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అలాగే రెజీనా పాత్రకు సంబంధించిన సీన్లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అయితే దర్శకరచయితలు థీమ్, పాత్రల పరంగా మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ కథనం విషయంలో మాత్రం విఫలం అయ్యారు. పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి
🌟 ట్విస్టులు :
సెవెన్ కథలో కార్తీక్ ఎవరు? కల్యాణ్ ఎవరు? రెజీనా కసండ్రా (సరస్వతి) పాత్ర ఏమిటి? పూజిత పొన్నాడ (భాను), అదితి ఆర్య పాత్రలు కథను ఎలా మలుపు తిప్పాయి? ఇంతకు కృష్ణమూర్తి పాత్ర ఉందా? ఉంటే దాని విషయం ఏంటి? ఈ వరుస హత్యల వెనుక అసలు కారణం ఏమిటి. చివరకు పోలీస్ అధికారి (రెహమాన్) కేసును ఎలా ఛేదించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సెవెన్ సినిమా కథ.
🔹ఫస్టాఫ్ :
సెవెన్ సినిమా హవీష్, నందిత శ్వేత, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్ లాంటి క్యారెక్టర్లతో పాజిటివ్ నోట్‌లో మొదలవుతుంది. కానీ సరిగా పండని సన్నివేశాలు, అనూహ్యమైన ట్విస్టులు కథను, ప్రేక్షకుడిని గందరగోళంలోకి నెట్టినట్టు అనిపిస్తుంది. జెన్నీ, ప్రియా క్యారెక్టర్లు కథలోకి ఎంటర్ కావడంతో ఏం జరుగుతుందనే విషయం ప్రేక్షకుడిని అర్థం కాకుండా ఉంటుంది. కృతిమంగా రూపొందించుకొన్న సన్నివేశాలతో ప్రేక్షకుడిని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఎలాంటి లాజిక్ లేకుండా హవీష్ ఎటాక్‌తో తొలి భాగం ముగుస్తుంది.
🔹సెకండాఫ్ :
ఒక సెకండాఫ్‌లో రెజీనా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేంత వరకు తలా తోక లేకుండా సినిమా సాగదీసినట్టు ముందుకెళ్తుంది. 1980 ఫ్లాష్ బ్యాక్‌లో సరస్వతిగా రెజీనా రావడంతో కథలో వేగం పెరుగుతుంది. ఇక రెజీనా పాత్ర వృద్ధాప్యంలోకి వెళ్లగానే మళ్లీ సినిమా ఎప్పటిలానే మొదటికి వస్తుంది. పేలవమైన యాక్టింగ్ స్కిల్స్‌తో నటీనటులు తమ పాత్రలను పండించకపోవడంతో సినిమా తేలిపోయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఉండే డ్రామా చాలా నాసిరకంగా ఉంటుంది. సరస్వతి పాత్రతో ఎమోషన్స్ పండించాల్సిన చోట సన్నివేశాలు కామెడీగా మారుతాయి.
👉దర్శకుడి ప్రతిభ :
సెవెన్‌లో బలమైన కథ ఉన్నప్పటికీ.. దానిని ఓ పద్దతి ప్రకారం రాసుకోవడంలో దర్శకుడు నిజార్ షఫీ విఫలమైనట్టు కనిపిస్తుంది. దర్శకుడిగా నిజార్‌పై సినిమాటోగ్రాఫర్ డామినేట్ చేశాడా అనే ఫీలింగ్ కలుగకమానదు. సెకండాఫ్‌లో ఉండే బలమైన కథ కోసం జరిగే డ్రైవ్, ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడంతో అది కూడా తేలిపోయనట్టు అనిపిస్తుంది. పాత్రల స్థాయికి నటీనటులు ఎంపిక చేసుకోకవడం సినిమాకు మరో మైనస్ పాయింట్‌గా మారింది. హీరోయిన్లకు సంబంధించిన క్యారెక్టర్లను లాజికల్ తీర్చిదిద్దడంలో తడబాటు కనిపిస్తుంది.
👉హీరో హవీష్ :
హీరో హవీష్ లుక్, మేకోవర్ బాగుంది. కానీ ఇంటెన్స్, ఎమోషనల్ సీన్లలో తేలిపోయాడు. నటనపరంగా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం చాలా ఉంది. కీలక సమయంలో ఎమోషన్స్ పడించడంలో విఫలమయ్యాడు. ఏడుగురు హీరోయిన్ల ముందు యాక్టింగ్ పరంగా వెనుకపడినట్టు కనిపిస్తుంది. యువ హీరోగా పుష్కలంగా భవిష్యత్ ఉంది కాబట్టి తదుపరి సినిమా కోసం యాక్టింగ్ పరంగా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
👉7 హీరోయిన్ల గురించి :
ఏడుగురు హీరోయిన్లలో రెజీనా కసండ్రానే మిగితా హీరోయిన్లను డామినేట్ చేసింది. నెగిటివ్ షేడ్స్ పాత్రలో రెజీనా అదరగొట్టింది. ప్రేమ కోసం తహతహలాడే యువతిగా పాత్రలో ఒదిగిపోయింది. 👉 నందిత శ్వేత కొంతలో కొంత తన పాత్రను రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. 👉 త్రిథా చౌదరీ అదితి, 👉పూజితా పొన్నాడ పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ తమ వంతుగా తమ పాత్రలకు మిగిలిన వారు కూడా న్యాయం చేశారు.ముఖ్యంగా రెహమాన్ పోలీస్ అధికారిగా ఆకట్టుకొన్నరు.
Rating : 2.5/5
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.