విచిత్రం ; ఆ ఇంటి గోడలో..80,000 తేనెటీగలు..

Spread the love

ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది.అక్కడ ఒక ఇంట్లో వింత శబ్దాలు రావడం తో ఆ ఇంటి లోని వారు హడలిపోయారు. స్పెయిన్ లోని ఆండలూసియా ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

👉విషయం లోకి వెళ్తే : గ్రనడా సిటీలో నివసించే ఓ జంటకు విచిత్రమైన సమస్య ఎదురైంది. కొన్నాళ్లుగా తమ బెడ్ రూంలో విచిత్ర శబ్దాలు వినిపిస్తుండడంతో వారు భయకంపితులయ్యారు. ప్రధానంగా ఓ గోడలోంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు గుర్తించి, అందులో ఏముందోనని హడలిపోయారు.
మొదట్లో ఆ సౌండ్ ను పక్కింటివాళ్ల వాషింగ్ మెషీన్ నుంచి వస్తున్న ధ్వనిగా భావించారు. కొన్నాళ్లు ఏసీ యంత్రం నుంచి వస్తున్న రొద అని అనుకున్నారు. కొన్నిరోజులుగా ఆ ధ్వనులు మరింత తీవ్రతరం కావడంతో తట్టుకోలేక అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేశారు.
👉అప్పుడే ఒక విచిత్రం జరిగింది: రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్స్ ఆ గోడను పగులగొట్టి చూడగా, నమ్మశక్యంకాని రీతిలో భారీ సంఖ్యలో తేనెటీగలు దర్శనమిచ్చాయి. అవి ఆ గోడలోకి ఎలా ప్రవేశించాయో వారికి అర్థంకాలేదు. సుమారు 80,000 తేనెటీగలు ఒక్కసారిగా ఝుంకారం చేయడం ద్వారా విచిత్ర శబ్దాలు ఉత్పత్తి అయినట్టు ఫైర్ ఫైటర్స్ వివరించారు. మొత్తమ్మీద ఆ స్పానిష్ జంటకు పెద్ద బాధ తీరినట్టయింది. ఇక వారికీ ఏ కందిరీగ ల జోరు..కాదు కాదు ఏ తేనెటీగల జోరు ఉండదు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading