*📘భారత రాజ్యాంగం📘*
*🇮🇳ప్రజల శాసనము🇮🇳*
_💥(నేటి: 05-03-2021 భాగము)💥_
👉. *మూడవ భాగము*
*మత స్వాతంత్ర్య హక్కులు*
*🔮ఆర్టికల్ 25🔮*
👉. 1) పరిశుభ్రత , నడవడిక , మంచితనము మొదలగువాటికి , ఈ భాగములో చెప్పబడివున్న ఇతరమైన వాటికి లోబడి , అందరూ తమ మనోభావం ప్రకారము నడుచుకొనుటకు తగిన స్వతంత్రత కలిగినవారగుదురు. తమ తమ మతమును స్వీకరింప , స్వీకరించి వ్యాప్తి చేయుటకు అధికారము కలిగినవారగుదురు.
2) ఈ నిబంధనలో ఉన్నవాటిని. అ] మత సంబంధముతో అనుబంధముగా ఉన్న ద్రవ్యోల్బణం , వీతి , ప్రభుత్వం మరియు ఇతర మత సంబంధము గలిగిన కార్యమునకు , ఆ] సంఘ సంక్షేమము , సంస్కరణ కల్పించుటకు లేక హిందువుల యెక్క దేవాలయములు మరియు మత సంబంధమైన స్థలములను హిందూమతములో చేరిన అన్ని జాతులవారికిని తారతమ్యము లేక తెరచి ఉంచుటకును , కావలసిన చట్టమును అమలు జరుపుటకును మరియు అటువంటి నూతన చట్టమును ఏర్పరచుటకును ఈ ప్రభుత్వము అడ్దుతగుల వీలుకాదు. వివరణము 1. కృపాణ్ (ఛురకత్తి) లను ఉంచుకొనుట , ధరించుట శిక్కు మతస్థుల ఒక ఆంగముగా తలచబడుచున్నది. వివరణము 2: 2వ సెక్షన్ 6 వ సబ్ సెక్షన్ ప్రకారము ఉన్న హిందు అను మాట శిక్కు , జైన , బౌద్ధ మతములకు చేరినవారిని సూచించుటే , హిందూ దేవాలయము , మత సంబంధమైన స్థలములు అనునవి అటువంటి శిక్కు జైన , బౌద్ధమత దేవాలయములు . మరియు మత సంబంధమైన స్థలములను సూచించునది అగును .