అమరావతి : ఎపిలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 8న ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 9న అవసరమైన చోట రీపోలింగ్, 10న ఎన్నికల ఫలితాలు వెల్లడి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని పేర్కొన్నారు. పాత నోటిషికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 513 జెడ్‌పిటిసి, 7,320 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, జెడ్‌పిటిసి ఎన్నికల బరిలో 2,092 మంది, ఎంపిటిసి ఎన్నికల బరిలో 19,002 మంది అభ్యర్థులు ఉన్నారు.
విజయవాడ
జెడ్పీ ఎన్నికల నోటిఫికేషన్
ఏప్రియల్ 8 న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు…10 న కౌంటింగ్
నూతన ఎస్ఇసి గా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే జెడ్పీ ఎన్నికలపై కసరత్తులు పూర్తి చేసిన నీలం సాహ్ని
న్యాయపరమైన చిక్కులు కూడా తొలగడంతో నోటిఫికేషన్ విడుదల
హైకోర్టు ఆదేశాలు నేపధ్యంలో ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
నూతన ఎస్ ఇసి నీలంసాహ్నిని కలిసి ఎన్నికల జెడ్పి నోటిఫికేషన్ పై చర్చించిన సిఎస్ ఆదిత్యనాద్ దాస్
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జెడ్పి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలుసుకున్న ఎస్ఇసి
ఎన్నికల జిర్వహణకి సంసిద్దత వ్యక్తం చేయడంతో నోటిఫికేషన్ జారీ
అభ్యర్ధులు మరణించిన స్ధానాలను మినహాయించి మిగిలిన స్ధానాలలో ఎన్నికలకి నోటిఫికేషన్
గత ఏడాది మార్చ్ 15 కరోనా కారణంగా జెడ్పి ఎన్నికలు వాయిదా
వాయిదా పడే సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయిన వైనం
రాష్ట్ర వ్యాప్తంగా 660 జెట్పిటిసి స్ధానాలకి నోటిఫికేషన్
8 జెడ్పిటిసి స్ధానాలకి కోర్టు వివాదాలతో ఆగిన ప్రక్రియ
మిగిలిన 652 జెడ్పిటిసి స్ధానాలకి 126 జెడ్పిటిసిలు వైఎస్సార్ సిపి ఏకగ్రీవం
13 మంది జెడ్పిటిసి అభ్యర్ధులు మృతి
మిగిలిన 513 జెడ్పటిసి స్ధానాలకి ఎన్నికల నోటిఫికేషన్
వైఎస్సార్ కడప జిల్లాలో 50 జెడ్పిటిసి స్ధానాలకి 38, చిత్తూరులో 65 స్ధానాలకి 30, కర్నూలు జిల్లాలో 53 స్ధానాలకి 16, ప్రకాశంలో 56 స్ధానాలకి 14 జెడ్పిటిసి స్ధానాలు, నెల్లూరులో 46 కి 12, గుంటూరులో 57 కి 8 స్ధానాలు, కృష్ణాలో 49 కి రెండు స్ధానాలు, పశ్చిమగోదావరి 48 కి రెండు స్ధానాలు, విజయనగరంలో 34 స్ధానాలకి మూడు, విశాఖలో 39 కి ఒక జెడ్పిటిసి వైఎస్సార్ సిపి ఏకగ్రీవం
*అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలో ఏకగ్రీవాలు నిల్
హైకోర్టు ఆదేశాలతో ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పిటిసిలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 513 జెడ్పిటిసి స్ధానాలకి ఎన్నికలు
జెడ్పిటిసి ఎన్నికల బరిలో 2092 మంది అభ్యర్ధులు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంపిటిసిల సంఖ్య – 9984
కోర్టు,ఇతరత్రా కారణాలతో ఆగిన ఎంపిటిసిలు- 288
గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన ఎంపిటిసిల సంఖ్య – 9696
ఏకగ్రీవాలైన ఎంపిటిసిలు- 2371…ఇందులో వైఎస్సార్ సిపి 2209, టిడిపి-101, జనసేన-4, ఇతరులు-67
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 433,వైఎస్సార్ కడప జిల్లాలో 432, ప్రకాశంలో 348, కర్నూలులో 312 ఎంపిటిసిలు ఏకగ్రీవం
91 చోట్ల అభ్యర్ధుల మృతితో మిగిలిన 7230 ఎంపిటిసిలకి జరగనున్న ఎన్నికలు
ఎంపిటిసిల బరిలో 19002 మంది అభ్యర్ధులు
ఓటర్ల సంఖ్య 2,82,15,104
పోలింగ్ బూత్ ల సంఖ్య- 33663
అతి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు- 11251
ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంధి 2,01,978