Teluguwonders:
ద్విచక్ర వాహనదారుడిని హెల్మెట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ పోలీసుపై చెప్పుతో దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
💥వివరాల్లోకి వెళ్తే :
రోడ్లు బాగోలేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సరిగా పనిచేస్తలేవు.. కానీ చలానా రాస్తావా అంటూ ఓ సామాన్యుడు పోలీసులపై తిరుగబడ్డాడని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోపై వాహనాలున్న నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.
సెప్టెంబర్ 1 నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఓ పోలీసుపై వాహనదారుడు చెప్పుతో దాడి చేసిన వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్డుమీద స్కూటీ నిలిపాడన్న కారణంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉస్మాన్ అలీ అనే వాహనదారుడుని ప్రశ్నించాడు. ఈ క్రమంలో దురుసుగా ప్రవర్తిస్తూ చేయి కూడా చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వాహనదారుడు తన చెప్పు తీసి ఆ కానిస్టేబుల్‌పై మెరుపుదాడి చేశాడు.
👉యూపీలోని మీరట్‌లో :
పియుష్ రాయ్ అనే నెటిజన్ ఇందుకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ ట్వీట్ చేశాడు. యూపీలోని మీరట్‌లో ఓ వాహనదారుడు రోడ్డు మీద స్కూటీ ఆపి ఉంచాడు. ఇది గమనించిన ట్రాఫిక్ హోంగార్డు అతడిని మందలించడంతో పాటు హెల్మెట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించాడు. చేయి కూడా చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన స్కూటీ రైడర్ హోంగార్డుపై చెప్పుతో మెరుపుదాడి చేశాడు. యూపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట సంచలనంగా మారింది.
🔴 అలా ముగిసింది :
హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్నావని ప్రశ్నించిన కారణంగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ఓ వాహనదారుడు చెప్పుతో దాడిచేశాడని కొన్ని వెబ్సైట్ ల లో కథనాన్ని పోస్ట్ చేశారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన తర్వాత పరస్పర క్షమాపణలతో ముగిసిపోయిందని సమాచారం.
🔴 ఇందులో నిజమెంత? :
కొత్త వాహన చట్టం అమల్లోకి రాకముందు ఈ ఘటన జరిగింది అని తెలుస్తుంది .
👉హెల్మెట్ లేదని ప్రశ్నిస్తూ చేయి చేసుకున్నాడన్న కారణంగా ఆగ్రహానికి లోనైన ఆ వాహనదారుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై తన చెప్పుతో దాడి చేశాడు.అది నిజమే కానీ బయట ప్రచారం జరుగుతున్నట్లుగా రోడ్లుబాగోలేకున్నా చలానా రాస్తావా అంటూ వాహనదారుడు పోలీసుపై దాడి చేశారన్న ఆరోపణల్లో నిజం లేదని తెలుస్తోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.