(దళిత) సామజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ని కౌలుదారులు అగ్రకుల అహంకారంతో పంచాయతీ కార్యాలయం లో ఫ్యాన్ కు ఉరి వేసారు.దీంతో తూర్పు గోదావరి జిల్లా రంగం పేటలో ఉద్రిక్తత నెలకొంది.
👉విషయం లోకి వెళ్తే:
తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మామిడి తోటలో ఒక మామిడి కాయ కోశాడని అతడిని చావగొట్టి దగ్గరలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో ఉరివేసారు. సభ్య సమాజం విస్తుపోయే ఈ సంఘటన వివరాల్లోకెళ్తే…
👉పెదపూడి మండలం జి. మామిడాడ గ్రామానికి చెందిన బక్కి శ్రీను అతని భార్య, పిల్లలను తీసుకుని రంగంపేట మండలం సింగంపల్లి గ్రామానికి వెళ్ళాడు. వారిని అక్కడ ఉంచి తిరిగి వెళ్తూ సింగంపల్లిలోని మామిడి తోటలో ఒక మామిడి కాయ కోసుకుని తిన్నాడు. అది చుసిన తోట కాపలాదారులు కడియం నాగేశ్వర రావు, ఏం రామకృష్ణ అతడిని పట్టుకున్నారు. విచక్షణ రహితంగా కొట్టారు.
అంతటితో శాంతించని ఆ కౌలుదారులు అతడిని పంచాయతీ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. పంచాయతీ కార్యాలయంలో బందించి మరోసారి విచక్షణ రహితంగా కొట్టారు. అనంతరం అతడు అదే కార్యాలయం లో ఫ్యాన్ కు ఉరి వేసి కనబడటం స్థానికులు గమనించారు.
🔴బంధువుల ఆరోపణ : నిందితులు అతడిని పంచాయతీ కార్యాలయంలో బంధించినట్టు చెబుతున్నారు. బక్కి శ్రీనును కౌలుదారులు హత్య చేసి ఫ్యాన్ కు ఉరివేసినట్టు మృతిని బంధువులు చెబుతున్నారు .
ఈ వ్యవహారంపై అమలాపురం మాజీ ఎం పీ జి వి హర్షకుమార్ సంఘటన ప్రాంతానికి చేరుకొని సంఘటన పూర్వాపరాలపై ఆరా తీశారు. ఈ సంఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఆయన డిమాండ్ చేసారు. పెద్దాపురం డీ ఎస్ పీ రామారావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రంగంపేట పోలీస్ లు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.