కొంతమందికి ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాదు జీవితాంతం వాళ్ళ కష్టాలు పడుతూనే ఉంటారు .ఎప్పుడూ వాళ్ల జీవితం కష్టాల మయం గానే ఉంటుంది . మరి కొంతమందికి మాత్రం అదృష్టం సునాయాసంగా కలిసి వస్తుంది .దాంతోవారి జీవితమే మారిపోతుంది. ఇప్పుడు చెప్పబోయే సంఘటన అలాంటిదే. ఒక మహిళ సరదాగా చేసిన పని ఆవిడ జీవితాన్నే మార్చేసింది . ధనవంతురాలిని చేసేసింది.
🎊వివరాల్లోకి వెళితే : లండన్‌లో ఓ యువతికి Ring రూపంలో అదృష్టం వరించింది. కూరగాయలు కొనుక్కోడానికి సంతకు వెళ్లిన యువతి పర్సులో మిగిలిన డబ్బుతో ఏదైనా కొందామనుకుని సంతలో తిరిగింది. ఉంగరాలు అమ్ముతున్న దుకాణం వద్దకు వెళ్లి తన దగ్గరున్న 13 డాలర్ల(రూ. 900)తో Ring కొనేసింది. కొద్దిరోజుల తరువాత ఆ ఉంగరాన్ని అమ్మేస్తే ఎంత వస్తుందో చూద్దామని తాకట్టు దుకాణానికి వెళ్లింది. ఒక వారం తరువాత ఎంత వస్తుందో చెబుతామని దుకాణదారులు చెప్పడంతో యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
🎊వారం తరువాత : ఒక వారం తరువాత దుకాణం వాళ్లు ఫోన్ చేసి ఆ Ring చాలా ప్రసిద్ది చెందినదని, 19వ శతాబ్దానికి చెందిన ఉంగరమని చెప్పారు. అంతే, నిమిషం పాటు తాను వింటున్నది నిజమేనా అని యువతి ఆశ్చర్యపోయింది. ఆ ఉంగరాన్ని వేలానికి పెట్టగా.. 8.5 లక్షల డాలర్ల(రూ. 5 కోట్ల 89 లక్షల 87 వేలు)కు అమ్ముడుపోయింది. 👉అంతే ఒకోసారి అదృష్టం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.