ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ కాలం లో పని మీద బయటకి వెళ్ళిన వారు గ్యారంటీ గా ఇంటికి తిరిగి వస్తారని గ్యారెంటీ లేకుండా పోయింది. ఎవరి లైఫ్ వారికే బిజీ అయిపోతున్న ఈ తరుణంలో పక్కవాడి పరిస్థితిని పట్టించుకునే వాడే లేడు. వాహనదారులు అయితే తమ ప్రయాణమే తమకు ముఖ్యం అనుకుంటున్నారు కానీ ఇంకేమీ పట్టించుకోవట్లేదు. కారణం సమయం లేకపోవడం అవ్వచ్చు లేదా నిర్లక్ష్యం వల్ల అవ్వచ్చు ఫైనల్ గా రోడ్లపై ప్రశాంతంగా ప్రయాణించలేకపోతున్నారు. దీని వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి . రోడ్డు రవాణా సంస్థ వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెరుగుతున్న జనాభా మరియు పెరుగుతున్న వారి బిజీ వల్ల ఎవరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటించడం లేదు .దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి .
ఒకరిద్దరి అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం వల్ల అన్యాయంగా కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి దీనికి ఏ తప్పు చేయని అమాయకులు కూడా బలవుతున్నారు . తాజాగా మహారాష్ట్రలో దారుణం జరిగింది .
🔴ఘోర రోడ్డు ప్రమాదం:మహారాష్ట్రలో ని సోలాపూర్-పుణె జాతీయ రహదారిపై సోలాపుర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతొ ఈ ప్రమాదం జరిగింది.
🔴ఈ ఘటనలో :ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగీ.. ఆర్టీసీ బస్సు, లారీ కాలి బుడిదయ్యాయి. పండరీపూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది.
🔴మృతులు, బాధితులు: ఈ ప్రమాదంలో 11మంది మంటల్లో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. 👉ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. గాయపడినవారు సోలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు .* ఎంత మంది ఓదార్చినా ప్రభుత్వాలు ఎంత సహాయం చేసినా నిజం గా ఈ బాధితుల కుటుంబాల్ని ఎవరూ అదుకోలేరు..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.