Teluguwonders:
ప్రేమకోసం హిందువుగా మారిన ముస్లిం..
ప్రేమించిన యువతి కోసం హిందువుగా మారిన యువకుడిపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు కురిపించింది. సామ్యవాదానికి ఇలాంటి వివాహాలు తోడ్పడతాయని వెల్లడించింది.
🔴యువతి తండ్రి ఫిర్యాదు :
తాను ప్రేమించిన హిందూ అమ్మాయి కోసం మతం మారిన ఓ ముస్లిం యువకుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, ఇది ఆ యువతి కుటుంబానికి నచ్చలేదు. దీంతో ఆ యువకుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మతాంతర వివాహాల పేరుతో మహిళల అక్రమ రవాణా నడుస్తోందని, న్యాయస్థానం ఆ కోణాన్ని పరిశీలించాలని యువతి తండ్రి అభ్యర్థించారు. కుమార్తె మతాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తూ దాఖలుచేసిన ఈ కేసులో ముస్లిం యువకుడు హిందూమతంలోకి మారి ఆమెను వివాహం చేసుకున్నాడు.
💥వివాహ విషయంలో జోక్యం చేసుకోబోమని :
హిందూ-ముస్లింలు చట్టప్రకారం పెళ్లి చేసుకుంటే సమస్యేముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఆ వివాహ విషయంలో జోక్యం చేసుకోబోమని, యువతి ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ మాత్రమే తమ ప్రధాన కర్తవ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, హిందువుగా మారిన ముస్లిం యువకుడు తన పేరును వివాహానికి ముందే మార్చుకున్నాడు. న్యాయపరంగా అనుసరించి ఆర్య సమాజంలో తన పేరును మార్చుకున్నట్టు కోర్టు విచారణలో తేలింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, యువతి అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.
💥గొప్ప ప్రేమికుడని సుప్రీం ప్రశంస:
ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ యువకుడిపై న్యాయస్థానం ప్రశంసలు కురిపించింది .. ఆయనో గొప్ప ప్రేమికుడని వ్యాఖ్యానించింది. అంతేకాదు మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని, ఇలాంటి వైవాహిక బంధాలు సోషలిజం పరిఢవిల్లడానికి తోడ్పడతాయని ఉద్ఘాటించింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.