నిత్యం రద్దీగా కిటకిటలాడుతూ ఉండే సాధారణ రైలు పెట్టెలో ప్రయాణించడం ఇష్టంలేని వారు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏసీ కోచ్ లను బుక్ చేసుకుంటారు. వారు ముఖ్యంగా సౌకర్యాన్ని కోరుకుంటారు. వారి సౌకర్యానికి ఆటంకం కలిగితే అంత ఖర్చు పెట్టి ప్రయాణిస్తున్నందుకు వారిలో అసహనం పెరిగిపోతోంది . రైలు రిజర్వేషన్ చేయించుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణాలు చేసే వారి లెక్క ఇలాగే ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏసీ పనిచేయకపోతే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంటుంది.
👉ఏసీ లు పని చేయక : జోథ్‌పూర్- బెంగళూరు ఎక్స్ ప్రెస్‌లో ఏసీలు వల్ల పనిచేయకపనిచేయకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు రైలు అధికారులకు బుద్ధి చెప్పాలని భావించారు. 🔴బలవంతంగా 92 కిలోమీటర్లు తమతో: విసిగిపోయిన ప్రయాణికులు తమ తోపాటు వారిని బలవంతంగా 92 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణం చేయించారు. 16507 జోథ్ పూర్- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.
🔴వివరాల్లోకి వెళ్తే : రాజస్థాన్‌లోని ఫాల్నా స్టేషన్‌లో ఏసీ పాడైంది. మరమ్మతులు చేసేందుకు వచ్చిన రైల్వే టెక్నీషియన్లు కోచ్‌లోని బ్యాటరీ మార్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ విధంగానే రైలు వడోదర నుంచి సూరత్ వరకూ వచ్చింది. ఈ నేపధ్యంలో కొందరు ప్రయాణికులు అనారోగ్యానికి గురయ్యారు. వారు మరోమారు ఆందోళనకు దిగడంతో ట్రైన్ టెక్నీషియన్లు తిరిగి బ్యాటరీ మార్చారు. అయినప్పటికీ ఏసీ పనిచేయలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడకు చేరుకున్న రైల్వే అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతూ, వారిని తమ పక్కనే కూర్చోబెట్టుకుని 92 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణింపజేశారు. కాగా ట్రైన్ వారణాసి చేరుకోగానే ఏసీలు పనిచేయడం ప్రారంభించాయి. దీంతో ప్రయాణికులు ఆ రైల్వే అధికారులను వల్సాడా స్టేషన్ దగ్గర దింపేశారు.కొద్దిపాటి అసౌకర్యం దెబ్బకి ..ప్రయాణికులు ఈ విధంగా ప్రవర్తించరెంటా..అనుకోవడం..అధికారుల పనయ్యింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.