అనిల్ అగర్వాల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సహజ వనరులు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికి తీయాల్సిన అవసరాన్నిఆగర్వాల్ గుర్తు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని అనిల్ అగర్వాల్ అన్నారు.
🔴భారత దేశ పరిస్థితి పై : భారత దేశ పరిస్థితిని ఆయన ‘మదర్ ఇండియా’ సినిమాతో పోల్చారు. ఆ సినిమాలో రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణమిచ్చిన వారు పట్టుకుపోతున్నారని, అలాగే, భారత్‌లోనూ 50శాతం ఆదాయాలను దిగుమతుల పైనే ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఆ తర్వాత వడ్డీలకు చెల్లింపులు పోగా మిగిలేది ఏమీ లేదన్నారు.
🔴ఆధార్ ఉన్న ప్రతీ వారికి : దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ముద్రా యోజన కింద రూ.2లక్షలు రుణం మంజూరు చేయాలని వేదాంత లిమిటెడ్ అధినేత అనిల్ అగర్వాల్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలు 3 రెట్లు గొప్పగా పని చేస్తాయన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించొచ్చని, ఉద్యోగాలను సృష్టించొచ్చని చెప్పారు.
👉సూచన బాగానే ఉంది కానీ: ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి రుణం ఇవ్వాలని అనిల్ అగర్వాల్ చేసిన సూచన బాగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 👉మరి ఈ సూచనను మోడీ పరిగణలోకి తీసుకుంటారా.. ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షలు రుణం ఇస్తారా.. ఏమో ..!! చూడాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.