Teluguwonders:
టర్కీకి వాయువ్య దిశలోని సారోస్ తీరంలో ఈ సంఘటన జరిగింది.
🔴విమానాన్ని సముద్రంలో ఎందుకు ముంచేశారు ..?
ఒక భారీ విమానాన్ని సముద్రంపైకి తీసుకువచ్చి, దాన్ని సముద్రపు నీళ్లలో ముంచేశారు.
ఎయిర్ బస్ ఎ- 330 విమానాన్ని ఇబ్రైస్ పోర్టు నుంచి మోటారు బోట్ల సహాయంతో తీరం నుంచి సముద్రంలోకి కిలోమీటరు దూరం తీసుకెళ్లారు. తర్వాత దాన్ని నీళ్లలో ముంచేశారు.
సముద్ర జీవులకు ఆవాసంగా ఈ విమానం ఉపయోగపడుతుందని, అలాగే స్కూబా డైవర్లను కూడా ఆకర్షిస్తుందని, అందుకే ఈ విమానాన్ని సముద్రంలో ముంచినట్లు టర్కీ అధికారులు తెలిపారు.
🔅ఇలా ముంచేశారు :
90 టన్నుల బరువున్న ఈ ప్రయాణీకుల విమానాన్ని ఉపరితలానికి 30 మీటర్ల లోతులో ముంచేందుకు ఇంజనీర్లకు నాలుగు గంటల సమయం పట్టింది.
ఈ విమానం పొడవు 65 మీటర్లు కాగా వెడల్పు 60 మీటర్లు. 1995 నుంచి 2018 వరకూ ఇది ప్రయాణికులకు సేవలు అందించింది.
సముద్రంలో కృత్రిమ దిబ్బలు, ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు విమానాన్ని ముంచడం ఇదే మొదటి సారి కాదు.
సముద్రంలో మునిగిపోయిన పడవలు, నౌకలు, విమానాలతో పాటు రైళ్లు కూడా సముద్రంలో భిన్న రకాల జీవులకు, మొక్కలకు ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇవి చేపల్ని కూడా ఆకర్షిస్తుంటాయి.
స్కూబా డైవర్లు, సముద్రం లోపల ఈత కొట్టాలనుకునే వారు, చేపలు పట్టాలనుకునే వారిని కూడా ఇవి ఆకర్షించడంతో ఈ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
1972లో అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో అధికారులు 7 లక్షల కారుటైర్లను సముద్రంలో ముంచారు.
👉సముద్ర జీవుల ఆవాసాలకు :
సముద్రంలో కృత్రిమంగా దిబ్బల వంటి ఆవాసాలుఇలా చేయడం ద్వారా ఏర్పడతాయని, అవి సముద్ర జీవులకు ఉపయోగపడతాయని అప్పట్లో పర్యావరణ నిపుణులు భావించారు.
అప్పట్లో రబ్బరు టైర్లను రీసైక్లింగ్ చేసేవారు కూడా కాదు. దీంతో వాటిని సేకరించే, సముద్రంలో ముంచే పని సులభం అయ్యింది.
🔴కానీ ఆలా జరుగలేదు :
ఈ ప్లాన్ రివర్స్ అయ్యింది. తుపానులు, భారీ అలలు వచ్చినప్పుడు ఈ టైర్లు సముద్రపు నేలను తుడిచేసేవి. అలా సముద్ర జీవులకు సహాయం చేయాల్సింది పోయి సాధారణ సముద్ర జీవనాన్ని ధ్వంసం చేశాయి.
ఈ టైర్లను వెలికి తీసేందుకు కొన్ని సంవత్సరాల పాటు డైవర్లు కృషి చేయాల్సి వచ్చింది. 👉అయితే, అన్ని రకాల కృత్రిమ దిబ్బలు, ఆవాసాలు పర్యావరణానికి మేలు చేయవు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.