జియో డోంగిల్ ధరను ఆ మధ్య భారీగా తగ్గించి అమ్మకాలను కొల్లగొట్టిన జియో వ్యూహాన్ని ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా కొనసాగించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే ఇండియాలో ఎయిర్‌టెల్ 4జి హాట్‌స్పాట్ ధరను భారీగా తగ్గించింది. అయితే కంపెనీ వెబ్ సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఇది కేవలం రెంటల్ బేసిక్ లో మాత్రమే అని తెలుస్తోంది.
👉దిమ్మతిరిగే ఆఫర్, రూ.399కే ఎయిర్‌టెల్ 4జి హాట్‌స్పాట్ :
ఇప్పటివరకు ఎయిర్‌టెల్ యూజర్లు రూ.999ని కొనుగోలు సమయంలో స్పెండ్ చేయాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లాన్ ప్రకారం ప్రతినెలా రూ.399 చెల్లిస్తే సరిపోతుంది. తద్వారా వైఫ్ హాట్ స్పాట్ ని వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ 4జి హాట్‌స్పాట్ కొనుగోలు తర్వాత నెలకు 500జిబి డేటా చొప్పున యూజర్లు పొందుతారు.
👉ఈ వైఫై డివైజ్ 10 డివైస్ ల వరకు :
ఈ వైఫై డివైజ్ ను స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టాబ్లెట్లు, స్మార్ట్‌టీవీల వరకు 10 డివైస్ ల వరకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ పనిచేయడానికి ఎయిర్‌టెల్ సిమ్ కార్డు కావాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లలో సిమ్ కార్డుకు రీఛార్జ్ చేసిన మాదిరిగా దీనికి కూడా రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోతే, ఈ హాట్‌స్పాట్ 3జీ నెట్‌వర్క్‌లోకి మారిపోతుంది.ఇందులో 1,500mAh batteryని పొందుపరిచారు.ఆరుగంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
🔅యూజర్ ఉన్న ప్రదేశంలో..3జీ ద్వారా కూడా హాట్‌స్పాట్ :
అంతేకాదు ఒక వేళ యూజర్ ఉన్న ప్రదేశంలో 4జీ అందుబాటులో లేకపోతే 3జీ ద్వారా కూడా ఈ హాట్‌స్పాట్ పనిచేస్తుంది. దీంతో వినియోగదారులు నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.అయితే రిలయన్స్ జియో 2300mAh batteryని ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ 4జి హాట్‌స్పాట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే 4జీ నెట్ వర్క్ నుంచి ఆటోమేటిగ్గా 3జీకి కనెక్ట్ కావచ్చు.
👉సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ :
ఈ మధ్య ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో పలు మార్పులు చేసింది. ఇకపై రూ.399 కు బదులుగా వినియోగదారులకు రూ.499 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కస్టమర్లకు 75 జీబీ డేటా, అన్‌లిమిడెట్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కింద మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, జీ5 సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, హ్యాండ్ ప్రొటెక్షన్ సర్వీస్‌లు లభిస్తాయి.
🔅రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 125 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, పైన చెప్పిన ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ లభిస్తాయి. అలాగే రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 150 జీబీ డేటా, రూ.1599 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లు వస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ లభిస్తాయి.
🔅డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ ఎయిర్‌టెల్ టీవీ సేవలు :
అలాగే ఇప్పటిదాకా స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్‌టెల్ టీవీ సేవలను ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ అందించనుంది. దీంతో వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపైనే కాకుండా.. ఇకపై డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్/ట్యాబ్లెట్ల ద్వారా వెబ్‌బ్రౌజర్లలో ఎయిర్‌టెల్ టీవీ సేవలు పొందవచ్చు. .
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.