TELUGUWONDERS
అల్లు వారింట పెళ్లి బాజా మోగింది పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నారా అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్, అల్లు శిరీష్ ల సోదరుడైన అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ తాజాగా పెళ్ళి పీటలెక్కారు.
💐నీలు షా తో వివాహం :
నీలు షా అనే ఒక యోగా ఇన్స్ట్రక్టర్ తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఆమెను పెళ్లి చేసుకున్నాడు బాబీ. ఈమె సింబాయిసిస్ నుంచి పుణెలో ఎంబీఎ చేశారు. సోదరితో కలిసి ఆమె యోగా డెస్టినేషన్ పేరుతో హైదరాబాద్ నగరంలో యోగా స్టూడియో నిర్వహిస్తోంది. యోగా థెరపీలో మాస్టర్ చేసిన నీలు ఒక ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కాంత్ కుమార్తె. ఇక బాబీ అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కు సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. వీరివురూ గత సంవత్సర కాలంగా డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్ళి పట్ల రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నారు.
🔴అల్లు బాబీ కి ఇది రెండవ పెళ్ళి :
బాబీకి పెళ్లి కాగా కొన్ని కారణాల వలన మొదటిభార్యతో విడాకులు తీసుకున్నారు.2005లో నీలిమ బండి అనే యువతిని పెళ్ళాడిన అల్లు శిరీష్ మూడేళ్ల క్రితం మొదటి భార్యతో విడాకులు తీసుకుని విడిపోయారు. 2016 లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.వీరికి అన్విత అనేకుమార్తె కూడా ఉంది.
👉సోషల్ మీడియాలో వైరల్ :
సాదాసీదాగా జరిగిన ఈ పెళ్లి తంతు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ నేపథ్యంలో అల్లు బాబీ కూడా సోషల్ మీడియా ద్వారా తమ పెళ్లి ఫోటోను పోస్ట్ చేస్తూ,ఈ విషయాన్ని పంచుకున్నారు. .
💐చాలా నిరాడంబరంగా :
ఈ వివాహ వేడుహైదరాబాద్లోనిఐటిసికోహినూర్హోటల్లోచాలానిరాడంబరంగాజరిగింది. ఈ వేడుకకుఅల్లు కుటుంసభ్యులతో పాటు చిరంజీవిసతీమణి సురేఖ, రామ్ చరన్ ఇంకా అతి కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా.
👉 అల్లు బాబీ మాట్లాడుతూ :
“ఫ్రెండ్స్.. నేను పెళ్లి చేసుకున్నాను. ఇది నాకు ఒక కొత్త ప్రారంభం. నన్ను ఆశీర్వదించండి. గతంలో 2005లో నేను పెళ్లి చేసుకున్నాను. 2016 లో మేము డివోర్స్ తీసుకున్నాం. దేవుడు నాకు మూవ్ ఆన్ అయ్యి సంతోషంగా ఎలా ఉండాలో నేర్పించాడు. ఈ విషయంలో నా ఫ్యామిలీ కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది” అంటూ అల్లు బాబీ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ప్రస్తుతం వీరి పెళ్ళి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
👉 అయితే ఈ పెళ్లి వేడుకలో ఎక్కడ అల్లు అర్జున్ కనపడకపోవడం గమనార్హం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.