Latest

    కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభమవుతున్న అమెజాన్ సరికొత్త భవనం

    Teluguwonders:

    ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండి ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూసిన నానక రాం గూడ లోని అమెజాన్ అతి పెద్ద భవనం ఈ రోజే ప్రారంభం జరుగుతోంది .అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక గుర్తింపు తెచ్చుకున్న మన హైదరాబాద్ ఇప్పుడు మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది. ఈ కామర్స్ రంగం లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ సంస్థ అతిపెద్ద కార్యాలయం ఇప్పుడు హైదరాబాద్ లో మొదలుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ సంస్థ కార్యాలయం పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో పాటు అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ సంస్థ డైరెక్టర్ జాన్ స్కాట్ క్లార్క్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ముప్పై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న అమేజాన్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్మించారు.

    పదెకరాల ప్రాంగణంలో పదిహేను అంతస్తులతో ఈ భవంతిని నిర్మించారు. దీనికి అమెజాన్ సంస్థ నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఈ కార్యాలయం నుంచే అమెజాన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

    బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు కొత్త సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లు అన్నీ ఇక అమెజాన్ హైదరాబాద్ నుంచే నిర్వహిస్తుంది. రెండు వేల పదహారు మార్చి ముప్పై ఒకటిన అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నానక్ రామ్ గూడలో ఈ భారీ క్యాంపస్ నిర్మాణానికి పునాది రాయి పడింది. మూడేళ్ల లోనే నిర్మాణం పూర్తి చేసుకొని తమ కార్యకలాపాలను మొదలుపెట్టబోతోంది. అమెజాన్ సంస్థ నిజానికి దశాబ్దం క్రితమే హైదరాబాద్ లో అమెజాన్ సంస్థ తమ కార్యకలాపాలన మొదలుపెట్టింది శంషాబాద్ లో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇప్పటి వరకూ తమ ఆపరేషన్స్ కొనసాగించింది. అయితే భాగ్యనగరం అన్నింటికీ అనుకూలంగా ఉండటం తెలంగాణా ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉండటం ప్రోత్సాహకాలు అందించడంతో అమెజాన్ సంస్థ తమ ప్రపంచ స్థాయి కార్యకలాపాల కోసం ఇక్కడే తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అమెజాన్ సంస్థ కార్యాలయం ఏర్పాటుతో భాగ్యనగరం కీర్తి ప్రపంచం నలుమూలలా వ్యాపించనున్నది. అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టడాని కి ముందుకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే అనేక సంస్థ లు హైదరాబాద్ ని పెట్టుబడు లకు కేంద్రం గా ఎంచుకున్నాయి.

    మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్, ఆపిల్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఇక్కడ్నుంచి ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి.దేశీయ ఐటీ కంపెనీ లు ఇన్ఫోసిస్, విప్రో, టిసిఎస్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు కూడా హైదరాబాద్ నే తమ వ్యాపారాభివృద్ధి కి కీలక కేంద్రంగా ఎంచుకున్నాయి. అమెజాన్ సంస్థ తో హైదరాబాద్ లో అనేక కొత్త పరిశ్రమల స్థాపన కు మెరుగైన అవకాశాలు ఏర్పడబోతున్నాయి. వ్యాపార నిర్వహణతో పాటు ఉపాధి కల్పన లో కూడా అమెజాన్ సంస్థకు మంచి పేరుంది. దీని ద్వారా తెలంగాణలో యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వ వర్గాలు. అమెజాన్ భాగ్యనగరానికి మరో మణిహారం కాబోతోందని చెబుతున్నారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading

    Subscribe