ఆ ఆఫర్ మనకి కాదండి,అమెజాన్ కంపెనీ ఉద్యోగులకే. ఔను..అమెజాన్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 👉ఉద్యోగం మానేసి అమెజాన్ ప్యాకేజింగ్ డెలివరీ entrepreneuer ‘s గా మారాలనుకునే వారికి పది వేల డాలర్ల(రూ. 7 లక్షల 4 వేలు) నగదును అందిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ఇన్‌సెంటివ్స్‌తో పాటు entrepreneuer’s గా మారాలనుకునే వారికి మూడు నెలల జీతాన్ని అదనంగా ఇవ్వనున్నట్టు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ తెలిపారు. కాగా, 👉ఇప్పటికే అమెజాన్ సంస్థ ప్యాకేజింగ్ డెలివరీకి సంబంధించి ఎక్కువగా యూఎస్ పోస్టల్ సర్వీస్, ఫెడ్‌ఎక్స్‌పై ఆధారపడుతుండటంతో 2018లో ‘డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా దాదాపు 200 మంది అమెజాన్ entrepreneuer’s గా మారారు. 👉తాజా ప్రకటనతో వేలాది మంది ఆంత్రప్రెన్యూర్లగా మారడానికి ముందుకొచ్చారని డేవ్ క్లార్క్ చెప్పారు. ప్యాకేజింగ్ డెలివరీ ఆంత్రప్రెన్యూర్లగా మారే వారు కంపెనీకి చెందిన డెలివరీ టెక్నాలజీ ట్రైనింగ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని, అంతేకాకుండా అస్సెట్స్, సర్వీసులపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా పొందచ్చని చెప్పారు.మరి ఈ ఆఫర్ కి ఆ ఉద్యోగులు రెస్పాన్స్ ఏమిటో…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.