Teluguwonders:
యాంకర్ రవికి పెళ్లయిందా లేదా అని చాలా రోజుల వరకు అనుమానం ఉండేది. ఆయన కూడా ఎప్పుడు అడిగినా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ కొన్ని నెలల కింద అందరికీ తన కుటుంబాన్ని పరిచయం చేసాడు రవి. తాను ఓ ఫ్యామిలీ పర్సన్ అంటూ తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. భార్య నిత్య సక్సేనాతో పాటు మూడేళ్ల పాపను కూడా చాలా రోజుల కిందే పరిచయం చేశాడు రవి. అప్పట్లో ఈయన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇక ఇప్పుడు మరోసారి తన కుటుంబాన్ని అందరికీ పరిచయం చేసాడు ఈయన.
తాజాగా ఈటీవీలో వచ్చిన ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు షోలో కూడా మరోసారి రవి కుటుంబంతో పాటు వచ్చాడు.
అక్కడికి కూడా భార్య నిత్యాతో పాటు కూతురు వచ్చింది. ముందు కంటే కాస్త ఎక్కువగా ఈ సారి పర్సనల్ విషయాలు చెప్పాడు రవి. ఇక ఈ షోలో రవిపై వచ్చే ఎఫైర్స్ గురించి మాట్లాడుకున్నారు. లాస్యతో అప్పట్లో రవికి సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు వర్షిణి, శ్రీముఖి లాంటి యాంకర్స్‌తో కూడా రవికి ఎఫైర్స్ ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అతడి భార్య నిత్య కూడా రవిపై వచ్చే వార్తల గురించి మనసు విప్పి మాట్లాడింది.
అలాంటివి విన్నపుడు తను అస్సలు ఫీల్ కానని.. ఇంకా రవికి తానే అండగా ఉంటానని చెబుతుంది. రవి కూడా ఇదే చెబుతున్నాడు. తనపై వచ్చే వార్తలు భార్య అస్సలు పట్టించుకోదని.. మరీ ముఖ్యంగా ఆమె సపోర్ట్ చేయడమే చాలా సార్లు తనను టెన్షన్ నుంచి బయట పడేస్తుందని చెబుతున్నాడు ఈ యాంకర్. మొత్తానికి రవిపై వచ్చే విమర్శలు.. రూమర్స్.. ఎఫైర్స్ గురించి కుటుంబంలో తెలిసినా కూడా పెద్దగా ప్రభావం ఉండదని వాళ్లే చెప్పడంతో ప్రస్తుతానికి ఈ రూమర్స్‌పై ఫుల్ స్టాప్ పడ్డట్లే.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.