Teluguwonders:
కన్నా సమక్షంలో బీజేపీలో చేరిన శ్వేతారెడ్డి, బిగ్ బాస్‌పై పోరాటంలో కన్నా మద్దతిచ్చారు,ఇప్పుడు రాష్ట్ర సమస్యలపై పోరాటానికి తాను సిద్ధం అంటున్నారు.
👉 వివరాల్లోకి వెళ్తే :
ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ శ్వేతారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూబీజేపీతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నందువల్లే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ‘బిగ్ బాస్‌పై పోరాటం చేసే సమయంలో.. ఏ పార్టీ, ఏ రాజకీయ నేత మద్దతు తెలపలేదు. నాకు అండగా నిలిచింది బీజేపీ, కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే’అంటున్నారు ఆవిడ.
💥యాంకర్ శ్వేతారెడ్డి :
బుధవారం సాయంత్రం గుంటూరులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు శ్వేతారెడ్డి.
👉శ్వేతారెడ్డి మాత్రమే కాకుండా శ్వేతారెడ్డితండ్రి కూడా కమలం గూటికి చేరిపోయారు.
తాను బిగ్‌బాస్‌పై పోరాటం చేస్తున్న సమయంలో కొందరు మాత్రమే స్పందించారని.. ఇక ఏ రాజకీయ పార్టీ దీనిపై మాట్లాడలేదన్నారు శ్వేతారెడ్డి. బీజేపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న లక్ష్మీనారాయణ మాత్రమే తన పోరాటంపై స్పందించారన్నారు. ట్వీట్లు చేసి తనకు మద్దతు పలికారని.. బీజేపీ మాత్రమే స్పందించిందని.. ఏబీవీపీ కూడా ఆందోళన చేసిందన్నారు. ప్రజా సమస్యలపై జర్నలిస్టుగా పోరాట చేయడం ఒక ఎత్తు అయితే.. బీజేపీలో చేరి ప్రజల కోసం పోరాటం చేయడం తన తాజా నిర్ణయమన్నారు. బిగ్ బాస్‌పై ఎలా పోరాటం ఎలా పోరాటం చేశానో.. రాష్ట్ర సమస్యలపై అలాగే పోరాడతానన్నారు.
💥గతంలో బిగ్ బాస్ పై రచ్చ – బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా ప్రయత్నించి చివర్లో భంగపడ్డ వివాదాస్పద యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్‌పై అప్పట్లో యుద్దం ప్రకటించింది. షో నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన శ్వేతారెడ్డి.. హోస్ట్ నాగార్జునపై కూడా గతంలో సంచలన కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌ల పేరుతో కంటెస్టెంట్స్ మానసిక స్థితితో ఆడుకుంటున్నారంటూ ఫైర్ అయ్యింది కాంట్రవర్శీ యాంకర్ శ్వేతా రెడ్డి. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా ప్రయత్నించి భంగపడ్డ శ్వేతారెడ్డి.. తరచూ సంచలన కామెంట్స్‌తో వార్తల్లోకి వస్తున్నారు. బిగ్ బాస్ ఆడిషన్స్‌లో భాగంగా తనను సెక్సువల్ ఫేవర్‌గా ఉండమని కోరారంటూ సంచలన ఆరోపణలు చేసిన శ్వేతారెడ్డి.. ఢిల్లీ స్థాయిలో తన నిరసన చేపట్టారు.
ఇక బిగ్ బాస్ గత నెల 21 ప్రారంభమై రెండు వారాలను కంప్లీట్ చేస్తున్న తరుణంలో అప్పట్లో మరోసారి మీడియా ముందుకు వచ్చి.. హోస్ట్ నాగార్జునపై వ్యక్తిగత దూషణకు దిగింది. అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను పశువుల్లా ట్రీట్ చేస్తున్నారంటూ మండిపండింది శ్వేతారెడ్డి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.