ఇదిలా ఉంటే, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 62,076 మంది భక్తులు దర్శించుకోగా, 23,699 మంది తలనీలాలు సమర్పించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు రోజులపాటు.. అంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివార్లు స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఇవాళ తొలిరోజు ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల12 వరకు వసంతోత్సవాలు జరగనుండడంతో గురువారం నిర్వహించే తిరుప్పాడను టీటీడీ రద్దు చేసింది. అలాగే 3 రోజుల పాటు పలు అర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 62,076 మంది భక్తులు దర్శించుకోగా, 23,699 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు సమకూరినట్లు TTD అధికారులు తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.