Teluguwonders:
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే … దాన్ని ఖచ్చితంగా ఆచరణలో చేసి చూపిస్తారనే విషయం మరోసారి రుజువయింది . తాము అధికారం లోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ , ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని ఎన్నికల ముందే అయన ప్రకటించిన విషయం తెల్సిందే . ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏ పీ ఎస్ బి సి ఎల్) తాము నిర్వహించే ఐ ఎం ఎఫ్ ఎల్ డిపోల్లో, కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు అర్హులైన వారి నుంచి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఇటీవల రాష్ట్రం లోని 13 జిల్లాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మద్యం దుకాణాల్లో పనిచేయడానికి పెద్ద ఎత్తున సేల్స్ మెన్, సేల్స్ సూపర్ వైజర్ల పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ , అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించి. మొత్తం 172 ఉద్యోగ ఖాళీలను ఆ సంస్థ ప్రకటించింది.
ఈ నెల 3 వ తేదీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న, ఏ పీ ఎస్ బి సి ఎల్ ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను అందజేయాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్టోబర్ నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. మద్యం దుకాణాల నిర్వహణ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించి , రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు .
దానిలో భాగంగానే ఇప్పటికే సేల్స్ మెన్ , సేల్స్ సూపర్ వైజర్ల ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన ఏ పీ ఎస్ బి సి ఎల్ ఇప్పుడు తాజాగా అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది . దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.