Teluguwonders:
భారత బౌలర్ మహ్మద్ షమీపై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గృహ హింస కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేేశించింది.
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 15 రోజుల్లోగా సరెండర్ కావాలని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు ఆదేశించింది. 2018లో షమీ భార్య హసీన్ జాహన్ అతడిపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న షమీ.. ప్రస్తుతం రెండో టెస్టులో ఆడుతున్నాడు. వరల్డ్ కప్‌లో భారత్ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు.
💥మహ్మద్ షమీ :
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మహ్మద్ షమీ.. వెస్టిండీస్ పర్యటనలో రాణిస్తున్నాడు..ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో కూడా ఉన్నాడు. . కీలక సమయంలో ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టి.. జట్టు విజయానికి తన వొంతు సహకారం అందిస్తున్నాడు. అయితే ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న మహ్మద్ షమీకి అలిపొరే కోర్టు షాక్ ఇచ్చింది.
💥గృహ హింస కేసులో :
గతంలో హసిస్ జహన్ వేసిన గృహ హింస కేసు నేపథ్యంలో షమీ, అతని సోదరుడు హసిద్ అహ్మద్‌కు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.వీరిద్దరు 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. తన భర్తకు వేరే అమ్మాయిలతో సంబంధాలుండటంతో తనతో గొడవలు పడుతున్నట్లు జాహన్ వివరించింది.
. హసీన్ జాహన్ ఫిర్యాదు మేరకు షమీతోపాటు అతడి సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కేసు నమోదైంది. ఇప్పటి వరకూ షమీ న్యాయస్థానం ముందు షమీ హాజరు కాలేదు.
ఈ క్రమంలో ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న షమీని సిరీస్ ముగిసి భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బీసీసీఐ మాత్రం ఛార్జిషీటును చూసేంత వరకూ షమీపై ఎలాంటి చర్యా తీసుకోబోమని స్పష్టం చేసింది. ఛార్జీషీటును తెప్పించుకొని పరిశీలించాకే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
🔴బీసీసీఐ స్పందన :
తాజాగా ఈ ఘటనపై బీసీసీఐ స్పందించింది. తమ అధికారులు షమీపై దాఖలు చేసిన చార్జ్‌షీటును పరిశీలించే వరకూ.. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నా ఊరుకొనేది లేదని స్పష్టం చేసింది. దీని గురించి బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘షమీపై అరెస్ట్ వారెంట్ దాఖలైన విషయం తెలిసింది. కానీ మేము ఆ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన తర్వాత బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాము. ఇప్పుడే తొందరపాటులో ఎటువంటి పని చేయవద్దని సూచిస్తున్నాము’’ అని అన్నారు.
ఇక షమీ బార్య అతనిపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏం అంటారు అన్న ప్రశ్నకు ‘‘ఆ కేసు వేరు.. ఇది వేరు. షమీపై అప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానిపై యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) నీరజ్ కుమార్ విచారణ జరిపారు. కేసు పరిశీలించిన తర్వాత అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసును పరిశీలించి.. అతను ఎటువంటి నేరం చేయలేదని నిర్ధారించారు. కానీ, ఈసారి పరిస్థితి వేరు. అతనిపై ఇప్పుడు ఎక్కువగా గృహ హింస ఆరోపణలు ఉన్నాయి. నిజానికి అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలి. వెస్టిండీస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత దీన్నుంచి బయటపడాలని ఆశిస్తున్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు.
🔴గతంలో :
షమీపై అతడి భార్య చేసిన ఆరోపణల కారణంగా గతంలో బీసీసీఐ అతడికి వార్షిక కాంట్రాక్ట్ ఇవ్వని సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్‌లో హసీన్ జాహన్.. షమీ ఇంటికెళ్లి రచ్చ చేసింది. దీంతో యూపీలోని అమ్రోహా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత ఆమెకు బెయిల్ లభించింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.