Atm సెంటర్ లు..మరింత తగ్గిపోనున్నాయా..

Spread the love

బ్యాంకు యాజమాన్యాలు ఏటీఎంల సంఖ్య పెంచాలని భావించగా, దేశ వ్యాప్తంగా ఇవి తగ్గిపోవడం విచిత్రంగా మారింది.

🔴ఏటీఎం కేంద్రాలు ఎందుకు మూతపడిపోతున్నాయి: దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు మూతపడిపోతున్నాయి. 👉నగదు కొరతకుతోడు నిర్వహణా భారాన్ని తగ్గించేందుకు ఆయా బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి.ఏటీఎం కేంద్రాలు మూతపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. 👉ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు జమ చేసే నగదు కంటే.. ఏటీఎం కేంద్రాల ద్వారా విత్‌డ్రా చేసే డబ్బు అధికంగా ఉంది. ఫలితంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. 👉దీనికితోడు కొన్ని బ్యాంకులు నిర్వహణాభారాన్ని తగ్గించుకునేందుకు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి.ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు మూసివేస్తున్నాయి.

🔴గడిచిన రెండేళ్ళకాలంలో : 2017 నుండి ఇప్పటివరకు 597 ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. గత 2017లో దేశవ్యాప్తంగా 2,22,300 ఏటీఎం కేంద్రాలు ఉండగా, 2019 నాటికి వీటి సంఖ్య 2,21,703కు పడిపోయింది. నిజానికి 2012 తర్వాత బ్యాంకు ఏటీఎంలు విస్తరణ రేటును పెంచాయి. అప్పట్లో ప్రతి 10,832 మందికి ఒక ఏటీఎం అందుబాటులో ఉంటే 2017 నాటికి ప్రతీ 5,919 మంది ఖాతాదారులకు ఒక ఏటీఎం చొప్పున అందుబాటులోకి వచ్చింది. కానీ, ఐదేళ్ల కాలంలో ఏటీఎం కేంద్రాలు మూతపడటం విచిత్రంగా ఉందని భారత రిజర్వు బ్యాంకు పేర్కొంది.

🔴కొన్ని చోట్ల మొరయిస్తున్న atm లు: కారణం ఏమో తెలియదు కాని చాలా చోట్ల atm లు మొరయిస్తున్నాయి.దాంతో వినియోగదారులు మండే ఎండలో atm ల ముందు క్యూ కడుతున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading