Latest

    బాలయ్య అంటే పాకీజా కు ప్రత్యేక అభిమానం అట..!!

    ” అసెంబ్లీ రౌడీ “సినిమా గుర్తుంది కదూ అందులో శుభ్రత పరిశుభ్రత అంటూ ఒక లెక్చరర్ లుక్ లో కనబడి బ్రహ్మానందాన్ని ఆటపట్టించిన ఆ నటి ఆ సినిమాలోని పేరుతో తోనే ఫేమస్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు పాకీజా .ఆమె అసలు పేరు వాసుకి.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాస్యనటి పాకీజాకు ప్రత్యేక స్థానం ఉంది. అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత తెలుగులో ముఖ్యంగా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’,‘పెదరాయుడు’వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. 👉తాజాగా ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో జాలీగా కార్యక్రమంలో పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

    👉బాలకృష్ణపై ప్రత్యేక అభిమానం : ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు బాలకృష్ణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలుగులో ఆమెకు బాలయ్య అంటే ఎంతో ఇష్టమని తెలియజేసారు. అంతేకాదు ఆయన సెట్‌లో ఆడవాళ్లతో ఎంతో మర్యాదగా మెలిగే వారని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన తోబుట్టువులతో ఎలా ఉండేవారో ఆడవాళ్లతో ఆలాగే బిహేవ్ చేసేవారన్నారు. 🔴విమాన ప్రమాద సంఘటనలో : అప్పట్లో బాలకృష్ణ,చిరంజీవి,విజయశాంతి వంటి హీరో హీరోయిన్స్ ప్రయాణించిన విమానం ప్రమాదానికి గురైన సందర్భంలో అందులో తాను కూడా ఉన్నట్లు పాకీజా తెలిపారు. ఆ సమయంలోనే బాలకృష్ణ తనకు పరిచయమయ్యారని, ఆర్టిస్టులందరు భయపడొద్దని బాలయ్య అప్పుడు అందరికీ ధైర్యం నూరిపోసారని పాకీజా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading