Teluguwonders:
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. యూజర్లు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేస్తోంది. రికార్డ్ చేయడమే కాకుండా దాని స్టోరీ రూపంలో మారుస్తోంది. ఇందుకోసం ఏకంగా కాంట్రాక్టర్లనే నియమించుకుంది. ఈ విషయాన్ని తొలిసారిగా Bloomberg report చేసింది. ఈ విషయం మీద ఫేస్‌బుక్ ను సంప్రదించగా కంపెనీ వెంటనే బదులివ్వలేదని కూడా తెలిపింది. ఇంతకీ Bloomberg ఏం చెప్పిందనే విషయం ఓ సారి చూద్దాం.
ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్ ద్వారా అందరూ కాల్స్ చేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగత విషయాలను కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ మాటల్ని స్క్రిప్ట్‌గా మార్చేందుకు వందలాది మంది కాంట్రాక్టర్లను నియమించుకుంది.
ఆ ఆడియో ఎక్కడ్నుంచి సేకరించామన్న విషయం చెప్పకుండా బయటి వ్యక్తులతో వాటిని ట్రాన్‌స్క్రైబ్ చేయిస్తోంది. కొన్నిసార్లు ఆ ఆడియోల్లో అశ్లీల సంభాషణ ఉండటం, వాటిని కూడా స్క్రిప్ట్ రూపంలోకి మార్చడం కలకలం రేపుతోంది.
వాయిస్ ఛాట్స్ ట్రాన్‌స్క్రైబ్డ్ ఆప్షన్:
అయితే ఫేస్‌బుక్ వాటిని ఎందుకు ట్రాన్‌స్క్రైబ్ చేయిస్తుందనే విషయం ఎవరకీ అంతు చిక్కడం లేదు. అయితే గతంలో యూజర్ల ఆడియోను స్క్రిప్ట్ చేయించామని, ఇప్పుడు చేయించట్లేదని ఫేస్‌బుక్ ఒప్పుకోవడం కూడా ఇందులో విశేషంగా చెప్పుకోవచ్చు. మెసెంజర్ యాప్‌లో వాయిస్ ఛాట్స్ ట్రాన్‌స్క్రైబ్డ్ ఆప్షన్ ఎంచుకున్న యూజర్లే ప్రభావితమయ్యారని కంపెనీ తెలిపింది.
అలెక్సా ఆడియో రిక్వెస్ట్‌లను:
ఇప్పటికే అమెజాన్, లాంటి కంపెనీలు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నాయి. వినియోగదారులు ఉపయోగించే కంప్యూటర్ డివైజ్‌లోని ఆడియో క్లిప్స్‌ను వినడం ప్రైవసీపై దాడి అన్న వాదన ఉంది. అలెక్సా ఆడియో రిక్వెస్ట్‌లను వినేందుకు అమెజాన్ వేలాది మందిని నియమించుకుందంటూ ఏప్రిల్‌లో మొదటిసారి బయటపెట్టింది బ్లూమ్‌బర్గ్.
ఎవరి వాదన వారిది:
ఆపిల్‌కు చెందిన సిరి, ఆల్ఫబెట్‌కు చెందిన గూగుల్ అసిస్టెంట్ రిక్వెస్ట్‌లను సమీక్షించేందుకు సిబ్బందిని నియమించారన్న విమర్శలున్నాయి. అయితే మానవ ప్రమేయం లేకుండా సమీక్షిస్తున్నామని గూగుల్ చెబుతుంటే, యూజర్ల అనుమతితో చేస్తున్నామని అమెజాన్ స్పష్టం చేసింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.