నిర్మాత బెల్లంకొండ గణేష్ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు సరైన సరైన హిట్ లు లేకపోయినా ఒక నిర్మాత కొడుకు కావడంతో వరుసగా సినిమా ఛాన్సులను అందిపుచ్చుకుంటున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి.
🔴శీను కెరీర్లో ఇప్పటివరకు హిట్స్ : ఇప్పటివరకు తన కెరీర్లో హిట్స్ అంటే అల్లుడు శీను జయ జానకి నాయక మాత్రమే అవి కూడా సోసో గాని ఆడాయి. మిగిలినవన్నీ బిలో యావరేజ్ మరియు ఫ్లాప్ లుగానే నిలిచాయి. తాజాగా గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా టాలీవుడ్ జనాల ని షాక్ కి గురి చేస్తుంది.
🔴ఏంటా సినిమా : 👉యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బెల్లంకొండ సినిమా..
గతేడాది చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కవచం’. తాజాగా ఈ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ రికార్డుల మోత మోగిస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ కవచం మూవీ గతేడాది చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కవచం’. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది.
🔴ఇన్‌స్పెక్టర్ విజయ్:
ఇక్కడ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను హిందీలో ‘ఇన్‌స్పెక్టర్ విజయ్’ పేరుతో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. యూట్యూబ్‌లో ఈ సినిమాను అప్‌లోడ్ చేసిన 24 గంటల్లో ఈ సినిమాకు కోటి 60 లక్షల మంది ఈసినిమాను వీక్షించారు. గత యేడాది డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. కొంత మంది తెలుగు ఆడియన్స్ కవచం హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఈ రేంజ్‌లో వ్యూస్ చూసి నిజమా కాదా మన తెలుగు ప్రేక్షకులు గిల్లుకొని మరి అవాక్కువుతున్నారు. సినిమా లెక్కలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం అంటున్నారు..సినీ విశ్లేషకులు…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.