పెరుగు ని ప్రతీ రోజు తినవచ్చా..పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు..

Spread the love

Teluguwonders:

పెరుగు లేకుండా భోజనం అనేది అసంపూర్ణం..అలాంటి భోజనం అసలు ఊహించలేం. పంచభక్ష పరమాన్నం పెట్టినా చివర మాత్రం పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార పదార్థాలలో దీనిని ‘ఆమృతం’తో పోలుస్తారు. మన దేశంలో పెరుగు సంపూర్ణాహారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెరుగు గురించి ఈ విషయాలు తెలిస్తే .. ఇష్టం లేనివారుసైతం తప్పక పెరుగు తింటారు.

1. పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా జయిస్తుంది. బరువును పెంచుతుంది, శరీరపుష్టిని కలిగిస్తుంది. జీలకర్ర పొడిని ఓ కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతుంది.

2. జలుబు ఉంటే పెరుగు తినకూడదు అంటారు.. కానీ జలుబుకు పెరుగు విరుగుడు.

3. మూత్ర సంబంధ రోగాలకు, జిగురు విరేచనాలకు పెరుగు ఉత్తమం.

4. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండేవాళ్ళకు పెరుగు అమృతం వంటిది.

5. పెరుగు రెగ్యులర్ గా తీసుకుంటే ఎపెండిసైటిస్ రాదు.

6. కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషధం. కామెర్లు వచ్చిన వారికి పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తే మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.

7. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది.

8. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది.

9. నిద్రపట్టని వారికి పెరుగు ఒక వరం. ఆయుర్వేదంలో గేదె పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని చెబుతారు.

10. చర్మవ్యాధులు, చర్మ కాంతులకు పెరుగు, మజ్జిగ అమోఘంగా పనిచేస్తుందని అంటారు.

🍚దధి : పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాల లో గోరువెచ్చగా ఉండగా మజ్జిగ చుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న, నెయ్యి, మీగడ లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.

వంటకం వివరాలు
👉ప్రధానపదార్థాలు –
పాలు, బాక్టీరియా.
పెరుగు
🍚పోషక విలువలు- 👉ప్రతి 100 గ్రాములకు
శక్తి 60 kcal 260 kJ
పిండిపదార్థాలు – 4.7 g
చక్కెరలు -4.7 g (*)
కొవ్వు పదార్థాలు -3.3 g
సంతృప్త 2.1 g
ఏకసంతృప్త 0.9 g
మాంసకృత్తులు -3.5 g
విటమిన్ A -27 μg 3%
రైబోఫ్లేవిన్ (విట. బి2) – 0.14 mg 9%
కాల్షియమ్ -121 mg 12%

🔴 చసిక్(cacik):

పెరుగుతో చేసిన చల్లని టర్కీ దేశపు వంటకం చసిక్(cacik) అంటారు.

🔵పెరుగు – బ్యూటీ టిప్స్ :

ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులు ప్రయత్నిస్తే చాలు.

🔅Cleanser :

పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మురికి వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం నునుపు దేలుతుంది.

🔅మాయిశ్చరైజర్:

ఒక టీ స్పూను నారింజ రసం, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత తడి టిష్యూతో తుడిచేసుకోండి. పొడి చర్మం తేమ గా మారడం తో పాటు, చర్మ కాంతి కూడా పెరుగుతుంది.

🔅ప్రోటీన్ మాస్క్ :

టే బుల్ స్పూను మినప్పప్పు ని, ఐదారు బాదం పప్పుల్ని రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోండి, గంట తర్వాత కడిగేసుకుంటే చర్మా నికి కావలసిన పోషకాలు అందుతాయి.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading