చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లే ప్రోగ్రాములో ఇస్రో తలమునకలై ఉంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ఎప్పటకి అయినా చంద్రమండలంపై మానవులు నివాసం ఏర్పాటు చేసుకునేలా పరిశోధనలు సక్సెస్ అవ్వవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అప్పుడే చంద్రమండలంపై మూన్ వాక్ చేసేశాడు… ఆయన్ను ఎవ్వరూ చంద్రమండలంపై తీసుకెళ్లకుండానే మూన్ వాక్ జరిగింది… అదెలా అని షాక్ అవుతున్నారా ? మరి ఈ మ్యాటర్లోకి వెళ్లి అసలు విషయం తెలుసుకోవాల్సిందే.
ప్రస్తుతం నేషనల్ వైడ్ గా ఈ వీడియో వైరల్ కూడా అవుతోంది. బెంగళూరు మెట్రోపాలిటిన్ సిటీ రేంజ్ కు ఎదిగినా నగరంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారినా బెంగళూరు రోడ్లను గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు. ఎంతో మంది ఈ రోడ్లపై ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రోడ్లన్నీ గుంతలు పడి ఉండడంతో బైక్ లు ఆ గుంతల్లో పడడంతో ప్రయాణికులు కింద పడడం ప్రమాదాలు జరగి గాయాల పాలవ్వడమో.. లేదా ప్రాణాలు కోల్పోవడమో జరుగుతోంది.
బెంగళూరు ప్రమాదాలపై న్యాయస్థానాలు సైతం ప్రభుత్వానికి ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చినా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో విసుగెత్తిపోయిన నగరానికి చెందిన బాదల్ నంజుండస్వామి వ్యోమగామి అవతారం ఎత్తారు. ఆ గుంతల్లోనే మూన్ వాక్ చేశారు. దానిని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నంజుండస్వామి వాకింగ్ చూస్తుంటే అది నిజంగా చంద్రమండలమే అన్న భ్రమల్లోకి వెళ్లిపోతాం… అయితే సడెన్ గా ఓ ఆటో వస్తుంది.. అప్పుడు కాని మనకు అది రోడ్డని అర్థంకాదు.
బెంగళూరు రోడ్ల బాధలపై నంజుండస్వామి గతంలో కూడా మోసలి వేసం వేసుకుని గుంతుల్లో ఉండి నిరసన తెలిపారు. స్వతహాగా ఆయన నటుడు కావడంతో బెంగళూరు వాసుల బాధలను ఇలా నిరసన రూపంలో ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఆయన ప్రయత్నాలను పలువురు మెచ్చుకుంటున్నా ప్రభుత్వానికి మాత్రం నగర వాసుల కష్టాలు తప్పడం లేదు.
https://youtu.be/JCUhg1qLv94
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.