బెర్రీ ఫ్రూట్స్ ని ఈ రోజే తినండి…

Spread the love

మీరు ఎప్పుడైనా బెర్రీ ఫ్రూట్స్ తిన్నారా!!! .లేదంటే తప్పకుండా తినండి. వాటిని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బెర్రీస్ లోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. పైగా బెర్రీలు క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు కలుగుతుందట.

🍓స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్‌ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. వాటి ఉపయోగాలేమిటో చూద్దాం.

🍓కళ్ళ ఆరోగ్యానికి : స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో, కంటి మీద మసక వంటి సమస్యల రాకుండా ఎదుర్కోగల శక్తి ఇందులో పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా కళ్ళను సూర్యరశ్మి నుండి, ఫ్రీరాడికల్స్ నుండి కాపాడటానికి అవసరం అయ్యే విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది.

🍓గుండెకు :బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటికి పంపుతుంది.గుండె సమస్యలకు దారితీసే ఆర్థరైటీస్ బారీన పడకుండా కాపాడుతుంది.

🍓క్యాన్సర్‌ నివారణకు :స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే.. ఓరల్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. బెర్రీ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీతో పాటు కలర్ ఫుల్ ఫ్రూట్స్‌ను వారానికి మూడుసార్లు తీసుకోవడం లేదా రోజుకు ఒక్కోటి తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 👉నలుపు రంగు బెర్రీ పండ్లను తీసుకుంటే నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలను నివారించుకోవచ్చు.

🍓కీళ్ళనొప్పులను తగ్గించడం కోసం :స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.

🍓హైబ్లడ్ ప్రెజర్‌ తగ్గుదలకు :గుండె ఆరోగ్యానికి కావల్సిన పోషకాంశాల్లో పొటాషియం కూడా ఒకటి. కాబట్టి స్ట్రాబెరీలో ఉండా పొటాషియం రక్త ప్రసరణను క్రమబద్దం చేయడానికి సహాయపడుతుంది. దాంతో హైబ్లడ్ ప్రెజర్‌కు గురికాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

🍓జీర్ణశక్తి కి : స్ట్రాబెరీలో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె ఆరోగ్య సమస్యలను నివారించడానికి స్ట్రాబెర్రీ బాగా సహాయపడుతుంది.

🍓మెదడు చురుకుదనానికి: బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్‌లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచటంలో తోడ్పడతాయి.

🍓అల్సర్‌ కంట్రోల్ చేయటానికి : స్ట్రాబెర్రీతో అల్సర్‌ని తగ్గించవచ్చట. పొట్టలో ఏర్పడే అల్సర్‌కు స్ట్రాబెర్రీతో చెక్ పెట్టవచ్చని పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్‌ అనే సంస్థ పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించే వారికి స్ట్రాబెర్రీ మరింత బాగా పనిచేస్తుందని, శరీరంలోని అల్సర్‌ని తగ్గిస్తుందని, వారు అంటున్నారు.

🍓 నిత్య యవ్వనంగా ఉండడానికి : బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading