Teluguwonders NEWS:
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటి హాఫ్ సెంచరీ దాటేసింది. ఈసారి శని, ఆదివారాల్లో నాగార్జున కాస్త ఆవేశంగా కనిపించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో జరగని ఉద్రిక్తత ఈ వారం నెలకొంది. ఒక టాస్క్ లో చెత్త పర్ఫామెన్స్ చేసిన పునర్నవి, మహేష్, శ్రీముఖి లకు షూ క్లీన్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పారు. కానీ ఆ పనిష్మెంట్ ని మహేష్, పునర్నవి వ్యతిరేకించారు. గలీజుగా షూ క్లీన్ చేయడం ఏంటీ..మమ్ముల్ని ఏమనుకుంటున్నారు..మేం పిలిస్తే వచ్చామే తప్ప అడుక్కొని రాలేదు అని ఆవేశ పడ్డారు.
ఆ తర్వాత మహేష్ ని శివజ్యోతి బుజ్జగించడంతో షూ క్లీన్ చేశాడు. తెల్లవారిన తర్వాత పునర్నవిని వరుణ్ సందేష్ బుజ్జగించడంతో ఆమె షూ పాలిష్ చేసింది.
ఇలా ఈ వారం బిగ్ బాస్ ని దారుణంగా తిట్టడంతో నాగార్జున వారిపై తీవ్రస్థాయిలో ఆవేశపడ్డారు. మిమ్ముల్ని బ్రతిలాడి ఎవ్వరూ ఇక్కడ ఉండమని చెప్పరు..ఇందులో గేమ్స్, టాస్కులు, పనిష్మెంట్స్ ఉంటాయని తెలియదా అని వారిద్దరిని అడిగారు. ఇక శ్రీముఖి ని కూడా బాగానే టార్గెట్ చేశారు. మొన్న ఒక టాస్క్ లో ఆమె అభిప్రాయాన్ని ఇంటి సభ్యులపై రుద్దడం..అందరూ ఫెయిల్ అయ్యారు. దాంతో వరుణ్ సందేశ్ ఆమెపై కోపగించుకున్నాడు.
ఈ విషయంపై నాగార్జున.. శ్రీముఖికి క్లాస్ తీసుకున్నారు. అయితే ఆ మొన్నటి వారం వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన శిల్పా చక్రవర్తి ఈ వారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. గతంలో తమన్నా కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి రెండు వారాలు మాత్రమే ఉండి వెంటనే వెళ్లిపోయారు. దాంతో ఈసారి బిగ్ బాస్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీలు అచ్చిరావడం లేదని అంటున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.