Teluguwonders:
లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయం’టాస్క్ రెండో రోజు కూడా కంటిన్యూ అయింది. ఈ టాస్క్ కరెక్ట్ గా లేదంటూ బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్ అయింది. అయితే ఈ టాస్క్ లో శ్రీముఖి, పునర్నవి, మహేష్ లను చెత్త పెర్ఫామర్స్‌గా ప్రకటించారు బిగ్ బాస్.దీనికి వారికి లగ్జరీ బడ్జెట్ దక్కదని చెప్పారు. అంతేకాదు.. వారికి శిక్షగా.. షూ పాలిష్ చేయాలని ఒక్కొక్కరికీ వందకి పైగా షూలను ఇచ్చారు.
వీటితో పాటు మిగతా ఇంటి సభ్యుల షూలను క్లీన్ చేయాలని శిక్ష విధించారు. దీనికి పునర్నవి అంగీకరించలేదు. ఈ విషయంలో బిగ్ బాస్ తో గొడవ పడింది. అలానే మహేష్ కూడా బిగ్ బాస్ కి ఎదురుతిరిగాడు. తప్పు చేస్తే షూలు తుడవడం ఏంటని మండిపడ్డాడు.
ముందు షర్ట్ లు పంపించాలని.. తన షర్ట్ లు అన్నీ చినిగిపోయాయని చెప్పాడు:
”మరీ దారణంగా చెప్పులు కడిగేది ఏంటి? మరీ అంత చీప్‌గా కనిపిస్తున్నామా? షర్ట్‌లు చిరిగిపోతే చెడ్డీతో ఉన్నా నేను. పిచ్చోళ్ల మాదిరి కనిపిస్తున్నామా? బట్టలన్నీ విప్పేసి కూర్చోవాలా? చెప్పులు తుడవమనడం టాస్కా? రేపు మీరు విప్పేసిన చెడ్డీలు ఉతకమంటారు ఉతకాలా?” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.
గతిలేక గేమ్ కి రాలేదని.. అప్లికేషన్ పెట్టి మమ్మల్ని తీసుకోండి అని అడగలేదని.. అప్లికేషన్ మీద రావడం వేరు.. ఇన్విటేషన్ మీద రావడం వేరని చెబుతూ.. చెప్పులు కడగండి. చెడ్డీలు ఉతకండి అంటే చేయాలా? అంటూ బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫైనల్ గా శివజ్యోతి కన్విన్స్ చేయడంతో వెనక్కి తగ్గి అయిష్టంగానే షూ పాలిష్ చేశాడు మహేష్.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.