ఔను..ఆ బస్సు..ఒక మినీ గార్డెన్

Spread the love

మనసుంటే మార్గం ఉంటుందంటారు.. నిజ జీవితంలో కొన్ని సంఘటనలు తారసపడినప్పుడు ఈ మాట సరైనదే అనిపిస్తుంది. కేవలం తాపత్రయంతోనే సరిపెట్టుకోకుండా అందుకు ఆచరణ మార్గం వెతికి అనుసరించే వారిని చూసి కచ్చితంగా స్ఫూర్తి పొందాల్సిందే! 🔅పర్యావరణాన్ని కాపాడాలనే తపన ఓ వైపు. ప్రభుత్వ ఉద్యోగం మరోవైపు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా రెండోదానికే ప్రాధాన్యమిస్తారు. కోటికొక్కరు మాత్రం వృత్తిని విడిచి సంకల్పం కోసం నడుం బిగిస్తారు. ఈ నేపథ్యంలో తపన, కొలువు రెండింటికీ ప్రాధాన్యమిస్తూ బెంగళూరుకు చెందిన ఓ బస్సు డ్రైవర్‌ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ‘‘వృక్షో రక్షతి రక్షితః’’ అనే మాటను నినాదాలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు.
👉వివరాల్లోకి వెళితే: అది బెంగళూరు మహా నగరం. అందులో ఓ సిటీ బస్సు. ప్రభుత్వరంగ సంస్థ అయిన బెంగళూరు మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ)కు చెందిన బస్సు అది. ఆబస్సు ప్రత్యేకత : ఈ బస్సు ఎక్కితే ఓ మినీ ఉద్యానవనంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది .ఔను ఈయన మొక్కలను పెంచుతున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఈ బస్సు డ్రైవర్‌ నారాయణప్ప ప్రకృతి ప్రేమికుడు. అందుకే ఆయన నడిపే ఈ బస్సులోనూ మొక్కలు మొలిచాయి. బెంగళూరులోని కవాల్‌, బైలసంద్ర, యశ్వంత్‌పూర్‌ ప్రాంతాల మధ్య ఈ బస్సు తిరుగుతుంది. దీనికి తరచూ డ్రైవర్‌గా నారాయణప్ప ఉంటారు. ప్రకృతి పట్ల ప్రేమ ఎక్కువగా ఉన్న ఈయన తన బస్సును మొక్కల కుండీలతో ఇలా పచ్చగా మార్చేశారు. పచ్చదనం పట్ల అవగాహన కల్పించాలనే ఆలోచనే తనతో ఇలా చేయించిందని నారాయణప్ప అన్నారు. అందుకే నాలుగేళ్ల క్రితం నుంచి బస్సులో మొక్కల కుండీలు ఉంచి ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్‌ చేస్తున్న ఈ అవగాహన కార్యక్రమం తెలుసుకుని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ ఆయన్ను అభినందించారు.
🔅సమాజానికి నారాయణప్ప సందేశం :
మహా నగరమైన బెంగళూరులో కాలుష్య స్థాయి ఎక్కువే. ప్రజలు తమకు తామే చొరవ తీసుకొని అవకాశమున్న చోట మొక్కలు పెంచితే బావుంటుందని నారాయణప్ప అభిప్రాయపడ్డారు. ఈయన చేసిన మంచి పనికి నెటిజన్ల నుంచి బస్సు డ్రైవర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

👉కానీ , ఇది చూసి ఒక నలుగురు ఐనా inspire అయితే ..ఈయన చేసే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading