వందల ఏళ్ల కిందటి ఓ అద్భుతదేవాలయం ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లోకల్లా అత్యంత పెద్ద దేవాలయంగా పేరు గాంచింది. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయం గా కాంబోడియాలో ఉన్న ఆ దేవాలయం పేరు “అంగ్ కోర్ వాట్ “. ఆ దేవాలయం గురించి,దాని ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఎంతచెప్పినా తక్కువే. ,
ఆ ఆలయ విశేషాలు మీ కోసం :
🔯అంగ్ కోర్ వాట్ చరిత్ర :
క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో ఇది ఒక భాగం.
ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్ కోరే. అయితే మొదట ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించిన అనంతరం, హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది. కావున దీనిని కాంభోజ రాజ్యంగా పిలిచేవారు. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణు భక్తుడు మరియు ఆరాధకుడు. ప్రపంచంలోనే అతి పెద్ద నగరం కూడా అంగ్ కోర్ నగరం పేరుగాంచింది. ఇక అప్పట్లోనే ఇక్కడ పది లక్షల మంది వరకు అక్కడ నివసించినట్టు చరిత్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అంగ్ కోర్ వాట్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ‘మహేంద్ర పర్వత’గా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించారు.
🔯ఆలయం లోని కళా సంపద:
ఆలయం లో కళాత్మకత వెల్లి విరిసింది. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా సింహాల శిల్పాలు ఉంటాయి. ద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలానే ప్రధాన గోపురం కింది గదుల్లో అద్భుతమైన పెయింటింగులు ఉన్నాయి.అంతేకాదు ఖ్మేర్ సామ్రాజ్యం నాటి పరిస్థితులతో పాటు రామాయణ, మహాభారత గాథలకు సంబంధించిన దృశ్యాలను వాటిల్లో చిత్రించారు.
🔯బౌద్ధారామం ఇంకా విష్ణుమూర్తి ఆలయం కూడా:అంగ్ కోర్ వాట్, ప్రధానంగా విష్ణుమూర్తి ఆలయం అనే చెప్పవచ్చు. ప్రధాన ఆలయంలోని అతిపెద్ద రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. అయితే ఖ్మేర్ సామ్రాజ్య పతనం అనంతర కాలంలో కాంబోడియాలో బౌద్ధం పరివ్యాప్తమైంది. ఆ సమయంలోనే, అంటే సుమారు 14వ శతాబ్దం సమయంలో అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని బౌద్ధారామంగా మార్చే ప్రయత్నం జరిగింది. అంగ్ కోర్ వాట్ లో అప్పటి ఉన్న శిల్పాలను, ఆలయాలను ఏమాత్రం మార్చకుండే కేవలం బుద్ధుడి ప్రతిమలను మాత్రం అదనంగా ఏర్పాటు చేశారు. తద్వారా అంగ్ కోర్ వాట్ ఆలయ రూపు దెబ్బతినకుండా ఉంది. బౌద్ధులకు, హిందువులకూ కలిపి ప్రపంచ పర్యాటక క్షేత్రం గా పేరొందింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.