వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం కోహ్లీ లండన్ లో ఉన్నారు. అయినా తన ఇంటి వద్ద తనకు తెలియకుండా జరిగిన చిన్న తప్పుకి 500 రూపాయల జరిమానా పడింది . వివరాల్లోకి వెళితే
🔴 తప్పు చేయకుండానే ఫైన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.500 జరిమానా విధించారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గురుగ్రామ్. అయితే.. నేరుగా తాను తప్పు చేయనప్పటికి ఫైన్ కట్టాల్సిన పరిస్థితి కోహ్లీకి ఎదురుకావటం విశేషం.
🔎విషయమేమిటంటే:కోహ్లీ ఇంట్లో పని చేసే సిబ్బంది చేసిన తప్పునకు కోహ్లీకి ఫైన్ విధించారు మున్సిపల్ సిబ్బంది. అసలేం జరిగిందంటే.. గురుగ్రామ్ లోని డీఎల్ ఎఫ్ ఫేజ్ 1లో కోహ్లీ నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో మొత్తం ఆరు కార్లు ఉన్నాయి. వీటిని శుభ్రం చేసే క్రమంలో.. ఇంట్లో పని చేసే పనిమనిషి కార్లను కడిగేందుకు మంచినీటిని ఉపయోగించాడు. ఈ విషయమై స్థానికులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కోహ్లీకి జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
🔴దేశ వ్యాప్తంగా నీటి సమస్య: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. పలు ప్రాంతాల్లో తాగు నీటి కోసం కూడా నీళ్లు దొరకని పరిస్థితి. ఇలాంటివేళ.. కొంతమంది సంపన్నుల ఇళ్లల్లో వేలాది గ్యాలన్ల నీళ్లు వృథా అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితే గురు గ్రామ్ లో చోటు చేసుకోవటంతో తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. ఇలాంటివేళ.. కోహ్లీ ఇంట్లో నీటిని వృధా చేయటం.. అనవసరమైన వాటి కోసం వినియోగించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల ఫిర్యాదుతో కోహ్లీకి రూ.500 జరిమానా విధిస్తూ మున్సిపల్ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.👉తప్పు చిన్నదైనా పెద్దదైనా శిక్ష శిక్షే ..దాని ముందు పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళయినా ఒకటే…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.